Vere Level Office OTT: వేరేలెవల్ కామెడీ గురూ.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ చూశారా..?

|

Dec 15, 2024 | 1:29 PM

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు చాలా వెబ్ సిరీస్ అందుబాటులోకి వస్తున్నాయి. సరికొత్త కంటెంట్‏తో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలోనే ఆహా నుంచి వచ్చిన లేటేస్ట్ వెబ్ సిరీస్ వేరే లెవల్ ఆఫీస్.

Vere Level Office OTT: వేరేలెవల్ కామెడీ గురూ.. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ చూశారా..?
Vere Level Office Ott
Follow us on

డిజిటల్ ప్రపంచంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా. వందశాతం తెలుగు కంటెంట్‏తో దూసుకుపోతుంది. సినీప్రియులకు ప్రతీవారం సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అందిస్తుంది. అలాగే ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను సైతం అడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. తాజాగా ఆహా ఓటీటీలోకి సరికొత్త వెబ్ సిరీస్ వచ్చేసింది. అదే ‘వేరే లెవల్ ఆఫీస్’. డైరెక్టర్ సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ కామెడీ వెబ్ సిరీస్‏లో బిగ్‏బాస్ ఫేమ్ ఆర్జే కాజల్, అఖిల్ సార్థక్, శుభశ్రీ, మిర్చి కిరణ్, రీతూ చౌదరి, మహేశ్ విట్టాలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ఫస్ట్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ప్రతి గురువారం, శుక్రవారం రాత్రి 7 గంటలకు ఈ సిరీస్ కొత్త ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి.

ఆఫీస్‍లో సీనియర్స్, జూనియర్స్ మధ్య జరిగే కథ ఇది. ఈ మధ్యకాలంలో యూత్‏ను దృష్టిలో పెట్టుకుని కార్పొరేట్ ఆఫీసుల నేపథ్యంతో ఈ సిరీస్ తెరకెక్కించారు. స్నేహం, ప్రేమ, ఆకర్షణ, ఉద్యోగ ఒత్తిడి ఇలా అన్ని ఎమోషన్లను టచ్ చేస్తూ ప్రేక్షకులకు ఏమాత్రం బోరింగ్ గా లేకుండా అనుక్షణం వినోదభరితమైన కథ, ఊహించని మలుపులతో మరింత ఆసక్తికర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది వేరేలెవల్ ఆఫీస్ వెబ్ సిరీస్.

ఈ వెబ్ సిరీస్‍కు అజయ్ అరసాడ సంగీతం అందించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోన్న యూత్ లైఫ్ స్టైల్, జీవితానికి అద్దం పడుతూ.. ఆద్యంతం నవ్వులు పంచుతూ సినీప్రియులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది ఈ వెబ్ సిరీస్. మరి ఇంకెందుకు ఆలస్యం నవ్వులు పూయిస్తోన్న ఈ వెబ్ సిరీస్ ను మీరు కూడా ఒకసారి చూసేయ్యండి.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.