
ప్రస్తుతం థియేటర్ల దగ్గర దీపావళి సందడి నెలకొంది. కాంతార ఛాప్టర్ 1తో పాటు మిత్రమండలి, తెలుసుకదా, డ్యూడ్, కె-ర్యాంప్ వంటి సినిమాలు థియేటర్లలో సందడి నెలకొంది. వీటికి పోటీగా ఈ వారం రష్మిక మందన్నా థామా బిగ్ స్క్రీన్ పై ప్రత్యక్షం కానుంది. అలాగే తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన బైసన్ కూడా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. ఇందులో చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా నటించాడు. అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. మరోవైపు ఓటీటీలోనూ సూపర్ హిట్ సినిమాలు సందడి చేయనున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు విజయ్ ఆంటోని నటించిన భద్రకాళి సినిమా కూడా ఓటీటీలోకి రానుంది. అలాగే హిందీ, కన్నడ, మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి అక్టోబర్ నాలుగో వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు వస్తున్నాయో ఓ లుక్కేద్దాం రండి.
Athanni needa chaalu… Bombay ni bayam tho nimpeyyadaniki 🔥 pic.twitter.com/reazdJH69q
— Netflix India South (@Netflix_INSouth) October 19, 2025
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.