Tiger3 OTT: ఓటీటీలోనూ అదరగొడుతోన్న సల్మాన్ టైగర్‌ 3.. విదేశాల్లోనూ టాప్‌లో ట్రెండింగ్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం 'టైగర్ 3'. మనీశ్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లో బాలీవుడ్ కింగ్ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ క్యామియో రోల్‌లో మెరిశాడు. దీపావళి కానుకగా నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైగర్‌ 3 బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి..

Tiger3 OTT: ఓటీటీలోనూ అదరగొడుతోన్న సల్మాన్  టైగర్‌ 3.. విదేశాల్లోనూ టాప్‌లో ట్రెండింగ్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
Tiger 3 Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 15, 2024 | 10:54 AM

సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం ‘టైగర్ 3’. మనీశ్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌లో బాలీవుడ్ కింగ్ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ క్యామియో రోల్‌లో మెరిశాడు. దీపావళి కానుకగా నవంబరు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైగర్‌ 3 బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సల్మాన్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. సల్మాన్‌ ఫ్యాన్స్‌ తో పాటు యాక్షన్‌ లవర్స్‌ను కూడా అలరించింది. థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచిన టైగర్‌ 3 ఇప్పుడు ఓటీటలోనూ దూసుకెళుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో సల్మాన్ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇండియాతో పాటు విదేశాల్లోనూ రికార్డు వ్యూస్‌ సొంతం చేసుకుంటోంది. ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ, న్యూజిలాండ్‌, సింగపూర్, మలేషియా, ఖతార్‌, ఓమన్‌ తదితర దేశాల్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ టాప్‌ -10 సినిమాల్లో ఒకటిగా ట్రెండ్‌ అవుతోంది టైగర్‌ 3.

యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో తెరకెక్కిన టైగర్‌ 3లో బాలీవుడ్ సీరియల్‌ కిస్సర్‌ ఇమ్రాన్‌ హష్మీ స్టైలిష్‌ విలన్‌గా నటించాడు. అలాగే సీనియర్‌ హీరోయిన్లు రేవతి, సిమ్రాన్‌ కీలక పాత్రల్లో మెరిశారు. రిద్ధి డోగ్రా, రణ్‌వీర్‌ షోరే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.  కాగా టైగర్‌ 3 సినిమాలో సల్మాన్‌, షారుక్‌ కాంబినేషన్ సీన్స్‌ అభిమానులను బాగా అలరించాయి. తాజాగా వీరిద్దరి యాక్షన్‌ సీక్వెన్స్‌కు సంబంధించి వీఎఫ్‌ఎక్స్‌ బ్రేక్‌ డౌన్‌ వీడియోను కూడా యశ్‌ రాజ్‌ఫిల్మ్‌ తాజాగా విడుదల చేసింది. సల్మాన్‌, షారుక్‌ల మధ్య యాక్షన్‌ సన్నివేశాలను ఎలా షూట్‌ చేశారు? వాటికి వీఎఫ్‌ఎక్స్‌ జోడించిన తర్వాత ఎంత థ్రిల్లింగ్‌గా మారాయి? అన్న ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో రివీల్‌ చేశారు మేకర్స్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.