ఈ ఏడాది సూపర్ హిట్ చిత్రాలతో ఫుల్ ఎంటర్టైన్మెంట్తో ప్రారంభమైంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడిన.. వాటి స్థానంలో చిన్న సినిమాలు విడుదలై సూపర్ హిట్ అందుకున్నాయి. వరుసగా విడుదలైన చిన్న చిత్రాలు ప్రేక్షకులను కావాల్సినంత వినోదాన్ని అందించాయి. ఇక ఫిబ్రవరి రెండోవారంలోనూ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందించేందుకు సినిమాలు, వెబ్ సిరీస్లు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ వారం సరికొత్త వినోదంతో ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయడానికి ఖిలాడి (Khiladi), ఎఫ్ఐఆర్, భామా కలాపం (Bhama Kalapam)వంటి చిత్రాలు బరిలో ఉన్నాయి. మరీ ఏఏ రోజున ఏ సినిమా థియేటర్లలో.. ఓటీటీలో విడుదల కాబోతుందో తెలుసుకుందామా.
మాస్ మాహారాజా రవితేజ, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఖిలాడి. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఖిలాడిపై అంచనాలను పెంచేశాయి. విభిన్నమైన యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో అర్జున్, అనసూయ కీలకపాత్రలలో నటించారు.
తమిళ్ టాలెంటెడ్ హీరో విష్ణు విశాల్..డైరెక్టర్ మను ఆనంద్ కాంబోలో వస్తోన్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ఎఫ్ఐఆర్. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. ఇందులో విష్ణు విశాల్ సరసన మంజిమా మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది.
యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి ప్రధాన పాత్రలో డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక తెరకెక్కిస్తున్న చిత్రం సెహరి. ఇందులో హర్ష్ సరసన సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్రర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం డీజే టిల్లు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్న ఈ చిత్రానికి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి12న థియేటర్లలో విడుదల కానుంది.
ఓటీటీలో వచ్చే చిత్రాలు..
టాలెంటెడ్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భామ కలాపం. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో టెలికాస్ట్ కానుంది. గృహిణిగా పక్కింట్లో జరిగే విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపే మహిళగా ప్రియమణి కనిపించనుంది. అలాగే యూట్యూబ్ ఛానల్లో వంటచేసే మనిషిగా కనిపిస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 11న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
తమిళ్ స్టార్ హీరో విక్రమ్.. ఆయన తనయుడు ధ్రువ్ విక్రమ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మహాన్. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నారు.
హీరో అక్కినేని సుమంత్ చాలా కాలం తర్వాత నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మళ్లి మొదలైంది. ఇందులో నైనా గంగూలి హీరోయిన్ గా నటిస్తుంది. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించగా.. నిర్మాత రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. విడాకులు తీసుకున్న ఓ యువకుడు తన న్యాయవాదితో ఎలా ప్రేమలో పడ్డాడు ? ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా. ఈ మూవీ ఫిబ్రవరి 11న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న మూవీ హీరో. ఇందులో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు.. నటుడు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ హీరోగా నటించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె, సిద్దాంత్ చతుర్వేది జంటగా నటించిన చిత్రం గెహ్రాహియా.. ఇందులో అనన్యా పాండే, ధైర్వా కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఫిబ్రవరి 11న స్ట్రీమింగ్ కానుంది.
Ram Gopal Varma: సోషల్ మీడియాలో అప్సరా రాణితో ఆర్జీవి రచ్చ.. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నా అంటూ..