Indrani Mukerjea OTT: దేశాన్ని కుదిపేసిన క్రైమ్‌.. ఇప్పుడు ఓటీటీలో.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

|

Mar 01, 2024 | 6:52 PM

'ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌' 'కర్రీ అండ్‌ సైనైడ్‌: ది జాలీ జోసెఫ్‌ కేస్‌' వంటి డాక్యుమెంటరీ సిరీస్ లకు మంచి స్పందన వచ్చింది. ఇలాంటి కోవలోనే వచ్చిన మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ 'ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌'. 2015లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై తెరకెక్కించిన డాక్యుమెంటరీ సిరీస్ ఇది.

Indrani Mukerjea OTT: దేశాన్ని కుదిపేసిన క్రైమ్‌.. ఇప్పుడు ఓటీటీలో.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
The Indrani Mukerjea Story Buried Truth Web Series
Follow us on

ఇటీవల ఓటీటీ సంస్థలు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు డాక్యుమెంటరీలను కూడా స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయ. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా స్వయంగా ఓటీటీ సంస్థలే వీటిని రూపొందిస్తున్నాయి. ఇటీవల అలా వచ్చిన ‘ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌’ ‘కర్రీ అండ్‌ సైనైడ్‌: ది జాలీ జోసెఫ్‌ కేస్‌’ వంటి డాక్యుమెంటరీ సిరీస్ లకు మంచి స్పందన వచ్చింది. ఇలాంటి కోవలోనే వచ్చిన మరో ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌’. 2015లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై తెరకెక్కించిన డాక్యుమెంటరీ సిరీస్ ఇది. ఫిబ్రవరి 23నే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ది ఇంద్రాణి ముఖర్జియా స్ట్రీమింగ్ కు రావాల్సి ఉంది. అయితే న్యాయపరంగా కొన్ని చిక్కులు పడడంతో వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు శుక్రవారం (మార్చి1)న నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగులోనూ అందుబాటులోకి ఉంది.

ఉరాల్‌ బహల్‌, షానా లెవీ తెరకెక్కించిన ది ఇంద్రాణి ముఖర్జియా సిరీస్ మొత్తం 4 ఎపిసోడ్లుగా ఉంది. ఒక్కో ఎపిసోడ్ 40 నిమిషాల పాటు ఉండనుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే.. 2012లో షీనా బోరా హత్య జరుగుతుంది. అయితే మూడేళ్లకు అంటే 2015లో ఈ దారుణం వెలుగులోకి వస్తుంది. ఓ కేసులో అరెస్టైన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్‌ను విచారించగా.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. షీనాను ఇంద్రాణీనే గొంతు నులిమి చంపేసిందని తెలిపాడు. అయితే ఈ కథలో ఎన్నో ఊహించని మలుపులున్నాయి. అలాగే ఎన్నో చీకటి కోణాలు కూడా ఉన్నాయి. అసలు కుమార్తెను చంపాల్సిన అవసరం ఇంద్రాణీకి ఏమొచ్చింది తెలియాలంటే ఈ డాక్యుమెంటరీ సిరీస్ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి