
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా నిత్యం సరికొత్త కంటెంట్ అడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. తెలుగులో సూపర్ హిట్ సినిమాలతోపాటు జనాలను ఆకట్టుకునే వెబ్ సిరీస్ తీసుకువస్తుంది. అలాగే గేమ్ షోస్, రియాల్టీ షోస్, ప్రోగ్రామ్స్ అంటూ ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. అయితే కొన్నాళ్లుగా సింగింగ్ టాలెంట్ ఉండి నిరూపించుకునేందుకు సరికొత్త ప్లాట్ ఫామ్ కోసం ఎదురుచూస్తున్న గాయనీగాయకులకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. తెలుగు ఇండియన్ ఐడల్ షో పేరుతో సింగింగ్ షో తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో మూడు సీజన్స్ విజయవంతగా కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు నాలుగో సీజన్ వస్తుంది. ఇప్పటికే ఈ సీజన్ కు సంబంధించి పోస్టర్స్, ప్రోమోస్ రివీల్ చేస్తూ ఆకట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి : గ్లామర్లో అరాచకం.. అందం ఉన్న కలిసిరాని అదృష్టం.. క్రేజ్ పీక్స్..
ఆగస్ట్ 29న అంటే ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఈ సీజన్ 4 ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇటీవలే ఈ సీజన్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ షోలో ఎప్పటిలాగే తమన్, కార్తీక్, గీతా మాధురి జడ్జీలుగా వ్యవహరిస్తుండగా.. సమీరా భరద్వాజ్, శ్రీరామచంద్ర హోస్టింగ్ చేస్తున్నారు. ఈరోజు ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 స్ట్రీమింగ్ అవుతుంది.
ఇవి కూడా చదవండి : Actress : ఎలాంటి డైట్ లేకుండా 35 కిలోల బరువు తగ్గిన హీరోయిన్.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..
‘గల్లీ టు గ్లోబల్’, ‘మనమే రా ఐడల్’ అనే థీమ్ కాన్సెప్టుతో ఈ సారి ఇండియన్ ఐడల్ సీజన్ ను తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో ఈ సీజన్ ప్రసారమవుతుంది.
ఇవి కూడా చదవండి : Serial Actress: ఆఫర్స్ కోసం వెళితే కమిట్మెంట్ అడిగారు.. అలా ఆకలి తీర్చుకున్నా.. సీరియల్ బ్యూటీ ఎమోషనల్..
Ganapati Bappa Morya!
May every obstacle turn into opportunity, just like every moment turns into entertainment on Aha. Subscribe & celebrate life!#aha #ganeshchaturthi pic.twitter.com/lfI4NtIAQ6
— ahavideoin (@ahavideoIN) August 27, 2025
ఇవి కూడా చదవండి : మహేష్ బాబుతో సూపర్ హిట్ మూవీ.. సినిమాలు వదిలేసి గూగుల్లో జాబ్.. ఇప్పుడు టాప్ కంపెనీకి CEOగా..