OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..

ఈ క్రమంలోనే తాజాగా తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం బోట్. ఇందులో కోలీవుడ్ టాప్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించగా.. చింబుదేవెన్ దర్శకత్వం వహించాడు. ఈ పీరియడ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆగస్ట్ 2న థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..
Boat Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 09, 2024 | 2:53 PM

ఈ పండగ సెలవుల్లో సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు సరికొత్త కంటెంట్ చిత్రాలను తీసుకువస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. ఈ దసరా సెలవులలో తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలతోపాటు ఇతర భాషలలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం బోట్. ఇందులో కోలీవుడ్ టాప్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించగా.. చింబుదేవెన్ దర్శకత్వం వహించాడు. ఈ పీరియడ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆగస్ట్ 2న థియేటర్లలో విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమా మంగళవారం అక్టోబర్ 8 నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ఈ సర్వైవల్ డ్రామా ఇది. బ్రిటీష్ పాలనలో ఉన్న అప్పటి మద్రాస్ ప్రావిన్స్ లక్ష్యంగా జపాన్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఆ సమయంలో ఇక్కడి ప్రావిన్స్ ప్రజల జీవితం అల్లకల్లోలంగా మారిపోయింది. దీంతో అక్కడ నివసించే 70 శాతం మంది ప్రజలు ప్రావిన్స్ ను వదిలి వేరే చోట్లకు వలస వెళ్లారు. అలా ఓ చిన్న బోటులో సము్ర మార్గాన తప్పించుకోవడానికి ప్రయత్నించి కొందరు వ్యక్తుల చుట్టూ తిరిగే సినిమా ఇది. ఇందులో ఆ చిన్న పడవను నడిపే వ్యక్తి పాత్రలో యోగిబాబు నటించాడు.

సముద్రం మధ్యలో మనుగడ కోసం కొందరు వ్యక్తులు సాగించే పోరాటాన్ని ఈ బోట్ మూవీలో అద్భుతంగా చిత్రీకరించారు. ముఖ్యంగా వాళ్లలోనే ఉన్న ఓ వ్యక్తి ఉగ్రవాది అని తెలియడం వాళ్లను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు ఆ సముద్రం దాటి ప్రాణాలతో బతికి బయటపడ్డారా అన్నదే కథ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం