Aranmanai 4 OTT: అఫీషియల్.. ఓటీటీలో తమన్నా, రాశీఖన్నాల లేటెస్ట్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

|

Jun 06, 2024 | 6:47 AM

తమిళంలో అరణ్మనై సిరీస్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. సస్పెన్స్, హారర్, థ్రిల్లింగ్, కామెడీ అంశాలు ఈ సిరీస్ సినిమాల్లో పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇదే సిరీస్ లో వచ్చిన నాలుగో చిత్రం అరణ్మనై 4. తెలుగులో బాకుగా రిలీజైంది.

Aranmanai 4 OTT: అఫీషియల్.. ఓటీటీలో తమన్నా, రాశీఖన్నాల లేటెస్ట్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Aranmanai 4 Movie
Follow us on

తమిళంలో అరణ్మనై సిరీస్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. సస్పెన్స్, హారర్, థ్రిల్లింగ్, కామెడీ అంశాలు ఈ సిరీస్ సినిమాల్లో పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇదే సిరీస్ లో వచ్చిన నాలుగో చిత్రం అరణ్మనై 4. తెలుగులో బాకుగా రిలీజైంది. డైరెక్టర్ సుందర్ సి తెరకెక్కించిన ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీస్ తమన్నా భాటియా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ తోనే ఆసక్తిని రేకెత్తించిన అరణ్మనై మే 3న థియేటర్లలో రిలీజైంది. తెలుగులోనూ బాకుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే తెలుగులో మాత్రం ఈ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, భయ పెట్టిన అరణ్మనై ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. అరణ్మనై 4 (సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్‍స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అయితే స్ట్రీమింగ్ డేట్‍ మాత్రం వెల్లడించలేదు. ‘కమింగ్ సూన్’ అంటూ ఆడియెన్స్ లో ఆసక్తిని రేకేత్తించింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..
కాగా అరణ్మనై 4 చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నారు. మరో వారం రోజుల్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. అరణ్మనై సినిమాలో కేజీఎఫ్ రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్, కోవై సరళ, యోగిబాబు, వీటీవీ గణేశ్, ఢిల్లీ గణేశ్, జయప్రకాశ్, ఫ్రెడ్రిక్ జాన్సన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అన్వి సినీమ్యాక్స్, బెంజ్ మీడియా బ్యానర్లపై ఖుష్బూ సుందర్, అరుణ్ కుమార్ ఈ సినిమాను. హిప్‍హాప్ తమిళ స్వరాలు సమకూర్చారు. ఇందులోని అచ్చో అచ్చచ్చో అనే ప్రమోషనల్ సాంగ్ యూబ్యూట్ లో రికార్డులను కొల్లగొడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.