OTT Movie: ఓటీటీలో 120 కోట్ల సినిమా.. యాక్షన్ సీన్స్ చూస్తే పూనకాలు గ్యారెంటీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ ఏడాది సంచలన విజయం సాధించిన ఊర మాస్ యాక్షన్ సినిమాల్లోఇది కూడా ఒకటి. ఏప్రిల్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సీన్స్ అయితే మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి.

OTT Movie: ఓటీటీలో 120 కోట్ల సినిమా.. యాక్షన్ సీన్స్ చూస్తే పూనకాలు గ్యారెంటీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie

Updated on: Jun 03, 2025 | 11:47 AM

మీకు మాస్ సినిమాలంటే ఇష్టమా? అద్దిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉన్న సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ సినిమా. పేరుకు హిందీ సినిమానే అయినప్పటికీ కథ అంతా ఆంధ్రప్రదేశ్ లోని చీరాలలో సాగుతుంది. శ్రీలంకలో‌ బోల్డంత బంగారాన్ని చోరీ చేసిన ఒక కరడుగట్టిన క్రిమినల్ ఆంధ్ర ప్రదేశ్ సముద్ర తీరానికి వస్తాడు. చీరాలలోని మోతుపల్లి వేదికగా తన నేర సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. పెద్ద పెద్ద పోలీసాఫీసర్లు కూడా ఆ క్రిమినల్ ను టచ్ చేయడానికి భయపడతారు. అలాంటి సమయంలో ఒక లేడీ ఎస్సై తన ఫిమేల్ కానిస్టేబుల్స్ తో కలిసి మోతుపల్లి వెళుతుంది. కానీ వీరందరిని లైంగికంగా వేధించడంతో పాటు ఇంట్లో బంధిస్తారు. అదే సమయంలో అనుకోకుండా హీరో అక్కడ దిగుతాడు. అతను టిఫిన్ చేస్తుండగా కొందరు లోకల్ గూండాలకు గొడవ దిగుతారు. ‌ అక్కడి నుంచి చిన్నగా మొదలైన గొడవ ఏకంగా ఆ హార్డ్ కోర్ క్రిమినల్ దగ్గరకు వెళ్లి ఆగుతుంది. అయితే హీరోతో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక సారీ చెబుతాడు సదరు క్రిమినల్. కానీ హీరో మాత్రం అక్కడ ఏదో తేడా జరుగుతుందని తెలుసుకుంటాడు. అక్కడి గూండాలను చితక్కొట్టి ఇంట్లో బంధించిన లేడీ పోలీసులను బయటకు తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ మూవీలో ఉన్న నటీనటులు అందరూ కూడా మన తెలుగు వారే. డైరెక్టర్ కూడా మన తెలుగు వాడే. ఇక ఈ సినిమాను నిర్మించినది మరెవరో కాదు పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకన్న మైత్రీ మూవీ మేకర్స్. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఏ సినిమా గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఆ మూవీ పేరు జాట్. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఓవరాల్ గా రూ. 120 కోట్లకు వసూళ్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమాలో సన్నీ డియోలో హీరోగా నటించాడు. రణ్ దీప్ హుడా విలన్ గా నటించాడు. అలాగే రెజీనా కసాండ్రా, సయామీ ఖేర్ , జగపతి బాబు , రమ్య కృష్ణ , వినీత్ కుమార్ సింగ్ , ప్రశాంత్ బజాజ్ , జరీనా వాహబ్ , ​​పి. రవి శంకర్, పృథ్వీరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ సంగీతం సమకూర్చారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు అందించారు. ‘జాట్‌’ సినిమా జూన్‌ 5 నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది.

మరో రెండు రోజుల్లో..

ఇవి కూడా చదవండి..

Tollywood: ‘ఆర్మీ ట్రైనింగ్‌ను, క్రికెట్‌ను మధ్యలో వదిలేశాను’.. పశ్చాత్తాపపడుతోన్న టాలీవుడ్ యాంకర్.. ఎవరంటే?

Tollywood: ఒకప్పుడు బార్ ముందు మంచింగ్ ఐటమ్స్ అమ్మాడు.. కట్ చేస్తే 800 కోట్ల సినిమాతో సంచలనం.. ఎవరో తెలుసా?

Tollywood: మహేష్‌తో సహా 12 మంది స్టార్స్ రిజెక్ట్ చేశారు.. చివరకు ఆ హీరో బ్లాక్ బస్టర్ కొట్టాడు.. ఏ మూవీనో తెలుసా?

OTT Movie: 8 కోట్లతో తీస్తే 83 కోట్లు.. IMDbలో 8.6 రేటింగ్‌.. ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్