SR Kalyanamandapam: ఆహాలో ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

SR Kalyanamandapam Movie: తెలుగు వినోద రంగంలో సరికొత్త కంటెంట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. రకరకాల వెబ్ సిరీస్ లతో కొత్తకొత్త..

SR Kalyanamandapam: ఆహాలో ఎస్‌ఆర్‌ కళ్యాణ మండపం స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?
Sr Kalyanamandapam Movie

Updated on: Aug 23, 2021 | 4:13 PM

SR Kalyanamandapam Movie: తెలుగు వినోద రంగంలో సరికొత్త కంటెంట్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ఆహా. రకరకాల వెబ్ సిరీస్ లతో కొత్తకొత్త సినిమాలతో.. ఆకట్టుకునే టాక్ షోలతో అలరిస్తుంది ఆహా. ఇక తాజాగా థియేటర్లలో విడుదలై వెండితెరపై మంచి విజయాన్ని అందుకున్న ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా ఆగస్టు 28 న ఆహా లో ప్రేక్షకులను అలరించినుంది. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. త్వరలో ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా కూడా రానుంది అని అన్నారు. వరుసగా ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ షో ఇలా ఏదో ఒక ప్రాజెక్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం తో ఆహా  ప్రేక్షకాదరణ పొందుతుంది.

ఆహాలో ఇప్పటికే ఉన్న వెబ్ సిరీస్ మరియు సినిమాలు – లెవ‌న్త్ అవ‌ర్‌, క్రాక్‌, జాంబి రెడ్డి, నాంది, సుల్తాన్‌, చావు క‌బురు చ‌ల్లగా వంటి బ్లాక్‌బ‌స్టర్‌ సినిమాలు, వెబ్ షోస్ మిమ్మల్ని త‌ప్పకుండా మెప్పిస్తాయి. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని పెద్ద సినిమాలు, షోలతో మరింత వినోదం అందివ్వనుంది ఆహా.

ఈ సినిమాలో కిరణ్‌ అబ్బవరం, సాయికుమార్‌, ప్రియాంక జవాల్కర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి శ్రీధర్‌ గాదే దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలై ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది. తన తాతక ట్టిన ఎస్‌ఆర్‌ కళ్యాణమండపానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కళ్యాన్‌ అనే యువకుడు ఏం చేశాడన్నదే ఈ సినిమా కథ. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో పాటు, యువతను ఆకట్టుకునేలా సినిమాను తీర్చిదిద్దిన విధానం ఎంతో మెప్పించింది. కాగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఇవీ కూడా చదవండి:

Producers Vs Theatre Owners: తెలంగాణ ఎగ్జిబిటర్స్‌కు కౌంటర్ ఇచ్చిన యక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్

Ramayana 3D: బాలీవుడ్ భారీ సినిమాలో మహేష్ ప్లేస్‌ను రీప్లేస్ చేసే హీరో దొరకడం లేదట.?