Dongalunnaru Jagratha: అప్పుడే ఓటీటీలోకి దొంగలున్నారు జాగ్రత్త మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

|

Oct 05, 2022 | 10:41 PM

మత్తు వదలరా సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అతను తెల్లవారితే గురువారం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అతను నటించిన చిత్ర దొంగలున్నారు జాగ్రత్త.

Dongalunnaru Jagratha: అప్పుడే ఓటీటీలోకి దొంగలున్నారు జాగ్రత్త మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Simha Koduri
Follow us on

సంగీత దర్శకుడు కీరవాణి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆయన తనయుడు శ్రీ సింహా కోడూరి. సంగీతంలో కాకుండా నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మత్తు వదలరా సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అతను తెల్లవారితే గురువారం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా అతను నటించిన చిత్ర దొంగలున్నారు జాగ్రత్త. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా విడుదలైన ఈ చిత్రం తెలుగు తెరకు ఒక సరికొత్త జోనర్‌ని పరిచయం చేసింది. సెప్టెంబర్‌ 23న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ థ్రిల్లర్‌ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో అక్టోబర్‌ 7వ తేదీ నుంచి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. మెర్సిడెస్ బెంజ్ SUVలో చిక్కుకున్న దొంగ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. సతీష్ త్రిపుర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి అస్రాని కథానాయికగా నటిస్తోంది. కాల భైరవ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ సినిమాను చూడలేని వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..