Takkar OTT: అప్పుడే ఓటీటీలోకి సిద్ధార్థ్‌ కొత్త సినిమా.. ‘టక్కర్‌’ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

|

Jun 23, 2023 | 2:38 PM

ఒకప్పుడు యూత్‌ ఫుల్‌ అండ్‌ లవ్‌ స్టోరీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు సిద్ధార్థ్‌. అయితే ఆ తర్వాత హిట్లు లేకపోవడంతో ఫేడవుట్‌ అయిపోయాడు. ఆ మధ్యన మహాసముద్రం అంటూ శర్వానంద్‌తో కలిసి వచ్చినా హిట్‌ మాత్రం అందుకోలేకపోయాడు. అయితే ఈసారి కొత్తగా యాక్షన్‌ పంథాను ఎన్నుకున్నాడు.

Takkar OTT: అప్పుడే ఓటీటీలోకి సిద్ధార్థ్‌ కొత్త సినిమా.. టక్కర్‌ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Takkar Movie
Follow us on

ఒకప్పుడు యూత్‌ ఫుల్‌ అండ్‌ లవ్‌ స్టోరీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు సిద్ధార్థ్‌. అయితే ఆ తర్వాత హిట్లు లేకపోవడంతో ఫేడవుట్‌ అయిపోయాడు. ఆ మధ్యన మహాసముద్రం అంటూ శర్వానంద్‌తో కలిసి వచ్చినా హిట్‌ మాత్రం అందుకోలేకపోయాడు. అయితే ఈసారి కొత్తగా యాక్షన్‌ పంథాను ఎన్నుకున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం టక్కర్‌. మజిలీ ఫేమ్‌ దివ్యాన్ష కౌషిక్‌ హీరోయిన్‌గా నటించింది. జూన్‌ 9 వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ యూత్ ఫుల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా కలెక్షన్లు కూడా రాలేదు. దీంతో సిద్ధార్థ్‌ ఖాతాలో మరో ప్లాఫ్‌ సినిమా చేరింది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని టక్కర్‌ సినిమా ఇప్పుడు ఓటీటీలో వచ్చేందుకు రెడీ అయ్యింది. ‘టక్కర్’ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది.

అయితే థియేటర్లలో విడుదలై నెల రోజులు పూర్తికాకుండానే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు టక్కర్‌. జులై 6 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కానంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. కార్తీక్ జీ దర్శకత్వం వహించిన టక్కర్‌ సినిమాలో కమెడియన్‌ యోగిబాబు, అభిమన్యు సింగ్‌, ఆర్జే విఘ్నేశ్‌కాంత్‌ కీలక పాత్రల్లో కనిపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.