AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి మరో కీలక పాత్ర పోషించాడు. నవంబర్ 07న థియేటర్లలో విడుదలైన ఈ లవ్ ఎంట్‌ర్‌టైనర్‌ సూపర్ హిట్ గా నిలిచింది.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే
The Girlfriend Movie
Basha Shek
|

Updated on: Nov 30, 2025 | 12:24 PM

Share

బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ తోనూ మెప్పిస్తోంది. అలా రష్మిక నటించిన లేటెస్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీ’ ది గర్ల్ ఫ్రెండ్’. అందాల రాక్షసి సినిమాతో హీరోగా మెప్పించి, చిలసౌ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కించడం విశేషం. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి రష్మికకు జోడీగా నటించాడు. నవంబర్ 07న థియేటర్లలో విడుదలైన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంచనాలకు మించి కలెక్షన్లు రాబట్టింది. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి రూ. 28 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలు పర్సనల్‌గా.. ప్రొఫెషనల్‌గా ఎలా ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. దీంతో చాలా మంది అమ్మాయిలు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను ఓన్ చేసుకున్నారు.

థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో రష్మిక సినిమా స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వెలువడింది. డిసెంబర్ 05 నుంచి ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. కాగా థియేట్రికల్ నెలరోజులు కాకముందే ది గర్ల్‌ఫ్రెండ్‌ ఓటీటీలోకి వస్తుండడం విశేషం.

ఇవి కూడా చదవండి

ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్, రావు రమేశ్, రోహిణీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

రష్మిక సినిమా గురించి ఒక మహిళ మాటల్లో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉపాధ్యాయుల‌ ప‌దోన్నతులు విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం!
ఉపాధ్యాయుల‌ ప‌దోన్నతులు విషయంలో సర్కార్ సంచలన నిర్ణయం!
సెమీస్ ఆశలు నిలవాలంటే.. ఎంత తేడాతో టీమిండియా గెలవాలో తెలుసా?
సెమీస్ ఆశలు నిలవాలంటే.. ఎంత తేడాతో టీమిండియా గెలవాలో తెలుసా?
రోజూ అర్ధరాత్రి ఒకే టైమ్‌కు.. ఒకే ఇంటి ముందు.. సీసీటీవీలో..
రోజూ అర్ధరాత్రి ఒకే టైమ్‌కు.. ఒకే ఇంటి ముందు.. సీసీటీవీలో..
NCERT వివాదంపై ప్రధాని మోదీ సీరియస్.. విద్యాశాఖకు కీలక ఆదేశాలు
NCERT వివాదంపై ప్రధాని మోదీ సీరియస్.. విద్యాశాఖకు కీలక ఆదేశాలు
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్..
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్..
చిన్నారి పునర్వికకు అండగా సామాన్యులతో పాటు మంత్రి లోకేశ్
చిన్నారి పునర్వికకు అండగా సామాన్యులతో పాటు మంత్రి లోకేశ్
జూబ్లీహిల్స్ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. ఈ నెల 27 నుంచి ట్రాఫిక్
జూబ్లీహిల్స్ వెళ్లేవారికి బిగ్ అలెర్ట్.. ఈ నెల 27 నుంచి ట్రాఫిక్
ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగుతున్నారా? ఆరోగ్యానికి బంగారంలాంటి..
ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగుతున్నారా? ఆరోగ్యానికి బంగారంలాంటి..
విశాఖ సముద్ర తీరంలో మిలాన్ 2026 విజయవంతం.. భారత్ నావికా సత్తా
విశాఖ సముద్ర తీరంలో మిలాన్ 2026 విజయవంతం.. భారత్ నావికా సత్తా
చనిపోతాననుకున్నా.. ఇప్పుడు ఆయన వల్లే బతికున్నా: జబర్దస్త్ రాజమౌళి
చనిపోతాననుకున్నా.. ఇప్పుడు ఆయన వల్లే బతికున్నా: జబర్దస్త్ రాజమౌళి