AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sapta Sagaralu Dhaati OTT: వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

777 చార్లీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైపోయారు కన్నడ స్టార్‌ హీరో రక్షిత్‌ శెట్టి. దీని తర్వాత అతను నటించిన మరో సినిమా 'సప్త సాగరదాచే ఎల్లో' (సైడ్‌ ఎ)'. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడ నాట భారీ వసూళ్లు సాధించింది. . సెప్టెంబర్ 1న విడుదలైన ఈ ఎమోషనల్‌ రైడర్‌కు అక్కడి యూత్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు

Sapta Sagaralu Dhaati OTT: వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Sapta Sagaralu Dhaati Movie
Basha Shek
|

Updated on: Sep 29, 2023 | 7:18 AM

Share

777 చార్లీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైపోయారు కన్నడ స్టార్‌ హీరో రక్షిత్‌ శెట్టి. దీని తర్వాత అతను నటించిన మరో సినిమా ‘సప్త సాగరదాచే ఎల్లో’ (సైడ్‌ ఎ)’. ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా కన్నడ నాట భారీ వసూళ్లు సాధించింది. . సెప్టెంబర్ 1న విడుదలైన ఈ ఎమోషనల్‌ రైడర్‌కు అక్కడి యూత్‌ బాగా కనెక్ట్‌ అయ్యారు. పాటలు కూడా సూపర్‌హిట్‌ అయ్యాయి. దీంతో మూడు వారాలు ఆలస్యంగా సెప్టెంబర్‌ 22న తెలుగులో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సప్తసాగరాలు దాటి పేరుతో ఈ సినిమాను రిలీజ్‌ చేసింది. ప్రమోషన్లు కూడా గట్టిగా చేశారు. దీంతో ఇక్కడి ఆడియెన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుందీ ఎమోషనల్‌ మూవీ. ముఖ్యంగా హీరోయిన్‌ రుక్మిణీ వసంత్, రక్షిత్‌ శెట్టిల జోడీ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతున్న సప్త సాగరాలు దాటి సడెన్‌గా ఓటీటీలో ప్రత్యక్షమైంది.శుక్రవారం (సెప్టెంబర్‌ 29) అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా ఇక్కడి థియేటర్లలో రిలీజైన వారం రోజుల్లోనే సప్తసాగరాలు దాటి మూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం. ప్రస్తుతం క‌న్న‌డతో పాటు తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

సప్తసాగరాలు దాటి సినిమాకు హేమంత్ రావు దర్శకత్వం వహించారు. రక్షిత్‌, రుక్మిణీలతో పాటు అవినాష్, శరత్ లోహితాశ్వ, అచ్యుత కుమార్, పవిత్ర లోకేష్, రమేష్ ఇందిర, గోపాల్ కృష్ణ దేశ్‌పాండే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. చరణ్‌ రాజ్‌ స్వరాలు సమకూర్చారు. అద్వైత గురుమూర్తి కెమెరామెన్‌గా వ్యవహరించగా, విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. మ‌ను (ర‌క్షిత్ శెట్టి) ఓ బడా వ్యాపార వేత్త దగ్గర కారు డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. ప్రియ‌ను(రుక్మిణి వ‌సంత్‌) గాఢంగా ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లిచేసుకోవాల‌ని నిర్ణయించుకుంటాడు. అలాగేసొంత ఇళ్లు క‌ట్టుకుని జీవించాలని ఇద్దరూ కలలు కంటారు. అయితే ఈ కల నెర‌వేర్చుకోవ‌డం కోసం చేయ‌ని నేరాన్ని త‌న‌పై వేసుకుంటాడు మ‌ను. మరి మను జైలు కెళ్లిన తర్వాత మను, ప్రియల జీవితాలు ఎలా మారిపోయాన్నది తెలుసుకోవాలంటే సప్తసాగరాలు దాటి సినిమా చూడాల్సిందే. కాగా ఈ సినిమాను మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కించారు. రెండో భాగం అక్టోబర్ 20న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..