Rudhrudu Movie: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

| Edited By: seoteam.veegam

May 18, 2023 | 6:55 PM

డైరెక్టర్ కతిరేషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో లారెన్స్ జోడిగా ప్రియా భవానీ శంకర్ నటించింది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రాగా.. కమర్షియల్ గా అంతగా హిట్ కాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు వస్తుంది.

Rudhrudu Movie: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రాఘవ లారెన్స్ రుద్రుడు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Rudhrudu
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. కాంచన సినిమాతో ప్రేక్షకులను భయపెట్టడమే కాదు.. కడుపుబ్బా నవ్వించిన లారెన్స్ .. ఆ తర్వాత కాంచన 2, 3 చేశారు. అయితే చివరిసారిగా ఆయన కాంచన 3 చిత్రంలో కనిపించారు. ఈ సినిమా తర్వాత దాదాపు మూడేళ్లు మరో చిత్రంలో నటించలేదు. చాలా కాలం తర్వాత ఆయన నటించిన సినిమా రుద్రుడు. డైరెక్టర్ కతిరేషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో లారెన్స్ జోడిగా ప్రియా భవానీ శంకర్ నటించింది. అయితే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రాగా.. కమర్షియల్ గా అంతగా హిట్ కాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు వస్తుంది.

ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. మే 14 నుంచి రుద్రుడు సినిమా తెలుగుతోపాటు.. తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో శరత్ కుమార్ విలన్ పాత్రలో నటించారు. ఈ సినిమాను ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ నిర్మించిన ఈ మాస్ ఎంటర్టైనర్ కు జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో రుద్ర ఐటీ ఉద్యోగిగా పని చేస్తుంటాడు. అయితే రుద్ర ఫ్యామిలీపై పగ పెంచుకున్న విలన్‌ శ‌ర‌త్ కుమార్‌ అతని భార్యతో పాటు తల్లిని దారుణంగా హత్య చేస్తాడు. మరి ఈ మర్డర్స్‌ రుద్ర జీవితంపై ఏ విధంగా ప్రభావం చూపాయి. హంతకుడిపై రుద్ర ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే ఈ సినిమా కథాంశం. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఠాగూర్ మ‌ధు రుద్రుడు సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.