మొదటి వారంలోనే అందరి మన్నలను పొందిన బిజినెస్ రియాలిటీ షో – నేను సూపర్ ఉమెన్. ఆహా, వీ హబ్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ షో లో ఏంజెల్స్ టీం సభ్యులైన సుధాకర్ రెడ్డి, రేణుక బొడ్ల, డాక్టర్ సింధూర నారాయణ, రోహిత్ చెన్నమనేని, శ్రీధర్ గాది రెండో వారంలో 1.65 కోట్లు ఇన్వెస్ట్ చేసారు. ఇక మూడో ఎపిసోడ్ విషయానికొస్తే.. పలువురు మహిళా వ్యాపారవేత్తలు హాజరయ్యారు. తమ బిజినెస్ థాట్స్‌ను షేర్ చేసుకుని ఆహా ఏంజెల్స్ టీమ్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
చేతన ప్రియాంక – ఫార్వర్డ్ పార్శిల్: అమ్మ, ఆవకాయ ఎవరు మర్చిపోలేరు. అలంటి ఒక మంచి ఆవకాయ కథ – చేతన ప్రియాంక కథ. తన వివాహం తర్వాత UK కి వెళ్ళినప్పుడు, ఆమె ఆవకాయ పచ్చడి రుచి కోసం చాలా ఆశపడింది. కానీ ఆవి ఎలా రావాలి? ఆమె మదిలో మెదిలిన ఆవకాయ ఆలోచన ఫార్వర్డ్ పార్సెల్ కంపెనీకి పునాది పడింది. భారత దేశం నుండి ప్రపంచంలో ఎక్కడికైనా వస్తువులు మరియు ఉత్పత్తులను అందించే ఆర్గనైజషన్ ఫార్వర్డ్ పార్సెల్. 2019 లో ప్రారంభమైన స్టార్టప్ కంపెనీ ఇది. ఇతర ఛానెల్‌లతో పోలిస్తే కస్టమర్‌లు 50% వరకు ఆదా చేయడంలో సహాయపడుతుంది. తాను 5% ఈక్విటీ వాటా అమ్మకానికి రూ. 50 లక్షలు కోరుతూ ఆహా నేను సూపర్ ఉమెన్ షో కి వచ్చింది. ఏంజెల్స్ దృష్టిని ఆకర్షించింది. అయితే సుధాకర్ రెడ్డి , రేణుక బోడ్లా తనకి మెంటోర్షిప్ అందించారు. కంపెనీని విజయపథంలో నడిపించడానికి వారి మార్గదర్శకత్వాన్ని అందించారు.
రచనా త్రిపాఠి – బయోరాస్ ఫార్మా వ్యవస్థాపకురాలు: హైదరాబాద్‌లోని CCMBకి చెందిన ఒక శాస్త్రవేత్త రచనా త్రిపాఠి. పారిశ్రామికవేత్తగా మారి దేశంలోని ప్రతి మూలకు సరైన ఆరోగ్య పరీక్షలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగారు. తన భాగస్వామి శిశిర్‌తో కలిసి, ఆమె AI, బయోకెమిస్ట్రీ శక్తిని ఉపయోగించుకునే సంచలనాత్మక బయోకెమికల్ పారామీటర్ పరికరాలను అభివృద్ధి చేసింది. “Prevention is better than cure ” అనే మంత్రాన్ని రచన దృఢంగా విశ్వసిస్తుంది. వారి వినూత్న పరికరాలు ఏంజెల్స్ పట్ల ఆసక్తిని చూపించారు. రచన మొదట్లో 2% ఈక్విటీ వాటా కోసం రూ. 1 కోటి పెట్టుబడిని కోరింది. రోహిత్ చెన్నమనేని, డాక్టర్ సింధూర నారాయణ, బయోరాస్ సామర్థ్యాన్ని గుర్తించి, అదే ఈక్విటీకి రూ. 50 లక్షలు ఆఫర్ చేశారు. వాడి వేడి చర్చల తర్వాత, వారు చివరికి 50% తగ్గింపు ఈక్విటీపై రూ. 1 కోటి రూపాయల పెట్టుబడికి అంగీకరించారు.
అమృత వర్షిణి – డాగీ విల్లే వ్యవస్థాపకురాలు: అమృత వర్షిణికి మూగజీవులైన కుక్కలు అంటే ఎంతో ఇష్టం. అందుకే డాగీ విల్లే స్థాపించింది. ఇక్కడ కుక్కలని ఒక కేజ్ లో ఉంచరు . అలాగే, బోర్డింగ్, డేకేర్, గ్రూమింగ్ మరియు బిహేవియర్ థెరపీ సేవలను అందించే డాగ్ కేర్ సెంటర్‌ను స్థాపించడం ద్వారా కుక్కల పట్ల తనకున్న ప్రేమను అభివృద్ధి చెందుతున్న వ్యాపారంగా మార్చుకుంది. హఫీజ్‌పేట్, మణికొండ మరియు గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ కంపెనీ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ ఎపిసోడ్ ప్రారంభంలో 20% ఈక్విటీ వాటా కోసం 80 లక్షలు కోరింది. అయితే ఏంజెల్స్ దగ్గర నుండి అమృత తన వ్యాపారం స్కేలబిలిటీ గురించి కొన్ని సందేహాలను ఎదుర్కొంది. అయితే, శ్రీధర్ గాధి, 10% వాటా కోసం 25 లక్షలను ఆఫర్ చేశాడు. దానికి అమృత అంగీకరించింది.
శ్రీదేవి – టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్స్ వ్యవస్థాపకురాలు: ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్, అలాగే అంకితభావం గల తల్లి అయిన శ్రీదేవి, టమ్మీ ఫ్రెండ్లీ ఫుడ్స్‌ను రూపొందించి పిల్లల పోషణలో విప్లవాత్మక మార్పులకు రూపకల్పన చేశారు . ఒక లక్ష మంది కస్టమర్ బేస్‌ను కలిగి ఉండటం, భారతదేశ సరిహద్దులను దాటి విస్తరించడం, అగ్రశ్రేణి పోషణను అందించడంలో శ్రీదేవి అంకితభావానికి అవధులు లేవు. విస్తరణ, విస్తృత ప్రభావం కోసం ఆమె అన్వేషణలో శ్రీదేవి 5% వాటా కోసం 50 లక్షలను అడుగుతూ తను ఆహ నేను సూపర్ ఉమెన్ షో కి వచ్చింది. ఆమె అంకితభావానికి ముగ్దులై, ఆమె సామర్థ్యానికి స్ఫూర్తిగా, రేణుకా బోడ్ల, సుధాకర్ రెడ్డి రెండు విభిన్న ఆఫర్‌లతో రంగంలోకి దిగారు. ఉత్సాహభరితమైన చర్చల తర్వాత, శ్రీదేవి, రేణుకా బొడ్ల, సుధాకర్ రెడ్డిల మధ్య భాగస్వామ్యాన్ని ఏర్పరచి, 8% ఈక్విటీ వాటా కోసం 40 లక్షలతో డీల్ కుదిరింది.
Mee Biorus kits antha Bharosa ga unnappudu 💁🏻♀
Angels kuda meeku istharu Investment Bharosa!!🤝💸#NenuSuperWoman episode-4 streaming now only on Aha!▶https://t.co/Mz3xkaw9V2#MeeBusinessDreamsKiDoorBell #WomenEntrepreneurs #BreakingBarriers@renukabodla @sridhargadhi… pic.twitter.com/CAHZmIDJ3K— ahavideoin (@ahavideoIN) July 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..