ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా వేదికగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2 షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు నందమూరి నటసింహాం బాలకృష్ణ. ఈ షోలోకి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులతో తన స్టైల్లో ఆడియన్స్ కు కావాల్సిన ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ, శర్వానంద్, అడివి శేష్, కిరణ్ కుమార్, అల్లు అరవింద్, సురేష్ బాబు ఈషోలో పాల్గొనగా.. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన స్నేహితుడు గోపిచంద్ తో కలిసి విచ్చేశారు. ఆహా విడుదల చేసిన ప్రభాస్ అన్ స్టాపబుల్ ప్రోమో యూట్యూబ్ ను షేక్ చేసింది. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ డిసెంబర్ 30న కానుంది. ఇక తాజాగా అన్ స్టాపబుల్ వేదికపై అలనాటి తారలు సందడి చేశారు. ఈ క్రమంలో తన క్రష్ గురించి బయటపెట్టింది రాశి ఖన్నా.
అందం, అభినయం కలగలసిన సహజనటి జయసుధ.. మల్టీటాలెంటెడ్ హీరోయిన్ జయప్రదతోపాటు.. నవతరం హీరోయిన్ రాశి ఖన్నా బాలయ్యతో కలిసి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ముగ్గురు భామల మధ్య బాలకృష్ణ సరదాగా అల్లరి చేశారు.
ఆ తర్వాత తన స్టైల్లో ప్రశ్నలు అడిగి ఇంట్రెస్టింగ్ విషయాలను రాబట్టాడు బాలయ్య. ఈ క్రమంలోనే రాశిఖన్నాని ఉద్దేశిస్తూ.. నువ్వు నటించిన హీరోల్లో నీకు ఎవరి మీద క్రష్ ఉంది అని అడగ్గా.. విజయ్ దేవరకొండ అంటే క్రష్ అంటూ ఠక్కున చెప్పేసింది రాశి. విజయ్ దేవరకొండతో కలిసి రాశి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించింది. ఇక ప్రస్తుతం రాశి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Mugguru muddhugummala tho mana balakrishnudu. Ayana allari, sandadi chudaalsindhe. December 23 na, mee aha lo.?#UnstoppableWithNBKS2 #NBKOnAHA #Jayasudha @realjayaprada #RaashiKhanna #MansionHouse @tnldoublehorse @realmeIndia @Fun88India #ChandaBrothers @sprite_india pic.twitter.com/QTRIEZHD7e
— ahavideoin (@ahavideoIN) December 19, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.