Agent OTT : ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ ఏజెంట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమాతో ఈ అక్కినేని అందగాడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేశాడు అఖిల్. బ్యాక్ టు బ్యాక్ హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు చేశాడు అఖిల్. వీటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఒకటి పర్లేదు అనిపించుకుంది.

Agent OTT : ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ ఏజెంట్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
Agent
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 09, 2024 | 12:08 PM

అక్కినేని అఖిల్ సక్సెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ సినిమాలు చేసినా.. ఎంతమంది దర్శకులను మార్చినా.. హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమాతో ఈ అక్కినేని అందగాడు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేశాడు అఖిల్. బ్యాక్ టు బ్యాక్ హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు చేశాడు అఖిల్. వీటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఒకటి పర్లేదు అనిపించుకుంది. కానీ ఈ సినిమా విజయం అక్కినేని ఫ్యాన్స్ కు సరిపోలేదు. ఈ సినిమా తర్వాత ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. భారీ డిజాస్టర్ గా నిలిచింది ఏజెంట్ సినిమా.. అయితే ఏజెంట్ సినిమా ఇంతవరకు ఓటీటీలోకి మాత్రం రాలేదు. సినిమాలన్నీ థియేటర్స్ లో రిలీజ్ అయిన 50, 60 రోజులకు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. కానీ ఏజెంట్ సినిమా మాత్రం ఓటీటీ రిలీజ్ కు నోచుకోలేదు.

ఏజెంట్ ఓటీటీ పై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్ 28న విడుదలైన ఈ ఏజెంట్ సినిమా ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశారు. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఏజెంట్ మూవీ నిర్మాత అనిల్ సుంకర అఖిల్ కు విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. దాంతో అఖిల్ ఫ్యాన్స్ ఏజెంట్ మూవీ ఓటీటీ రిలీజ్ పై అనిల్ ను ప్రశ్నించారు. దాంతో ఆయన స్పందిస్తూ.. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సోనీ లివ్‌ దక్కించుకుందని అనిల్ తెలిపారు. ఈ విష‌యాన్ని చాలా సార్లు చెప్పాను. అతి త్వ‌ర‌లోనే ఏజెంట్ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అనిల్ ట్వీట్‌ ద్వారా తెలిపారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..