బలగం హీరో ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డార్లింగ్. జులై 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ పర్వాలేదనిపించుకుంది. ముఖ్యంగా ప్రియదర్శి, నభాల నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కించిన డార్లింగ్ సినిమాలో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మరో కీలక పాత్రలో మెరిసింది. బ్రహ్మానందం, రఘుబాబు, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా విడుదలకు ముందే పాటలు, టీజర్, ట్రైలర్లతో అందరి దృష్టినీ ఆకర్షించింది. మరీ ముఖ్యంగా సుమారు నాలుగేళ్ల తర్వాత నభా నటేష్ బిగ్ స్క్రీన్ పై మెరిసింది. దీంతో డార్లింగ్ సినిమాపై బాగానే బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే జులై 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సిల్వర్ స్క్రీన్ పై ఆడియెన్స్ మెప్పు పొందిన డార్లింగ్ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీఫ్లస్ హాట్ స్టార్ డార్లింగ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో (మంగళవారం )ఆగస్టు 13 నుంచే ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ఇది వరకే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. అంటే సోమవారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానుందన్నమాట.
తెలుగుతో పాటు మలయాళం, కన్నడ, హిందీ, తమిళ్ భాషల్లో డార్లింగ్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండనుంది. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించారు. విక్రమ్ అపరిచితుడు తరహాలో మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే సమస్యకు మంచి వినోదాన్ని జోడించి దర్శకుడు డార్లింగ్ ఈ మూవీని తెరకెక్కించాడు. నటుడు సుహాస్, మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ సినిమాల్లో క్యామియో రోల్స్ పోషించడం విశేషం. మరి థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన డార్లింగ్ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఇవాల్టి అర్ధరాత్రి నుంచే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
Presenting most entertaining character…Anandhi 🔥#DarlingonHotstar Streaming from 13th August only on #DisneyPlusHotstar@PriyadarshiPN @NabhaNatesh @dir_aswin @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets #VivekSagar @GNadikudikar @NareshRamadurai @PradeepERagav @seethu77in… pic.twitter.com/psuBw2LfLo
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) August 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.