Kalki 2898 AD OTT: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు ఓటీటీల్లోకి కల్కి.. స్ట్రీమింగ్ డేట్ ఇదిగో

|

Aug 06, 2024 | 8:39 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా థియేటర్లలో విడుదలై దాదాపు 40 రోజులు పూర్తయిపోయింది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా అక్కడక్కడా ఆడుతున్నప్పటికీ థియేట్రికల్ రన్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కల్కి ఇప్పటివరకు సుమారు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

Kalki 2898 AD OTT: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండు ఓటీటీల్లోకి కల్కి.. స్ట్రీమింగ్ డేట్ ఇదిగో
Kalki 2898 Ad Movie
Follow us on

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా థియేటర్లలో విడుదలై దాదాపు 40 రోజులు పూర్తయిపోయింది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా అక్కడక్కడా ఆడుతున్నప్పటికీ థియేట్రికల్ రన్ దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న కల్కి ఇప్పటివరకు సుమారు రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది స్పెషల్ ఫిల్మ్. ఎందుకంటే బాహుబలి తర్వాత వరుసగా ప్లాఫ్ లు అందుకున్న డార్లింగ్ కల్కి సినిమాతో మళ్లీ తన స్టామినాను చూపించాడు. దీంతో కల్కి సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారికోసమే కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ఇదే ఆగస్టు నెలలోనే ప్రభాస్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా కల్కి సినిమా ఏకంగా రెండు ఓటీటీల్లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆగస్ట్ 23 నుంచి కల్కిని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధింంచి ఒక పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ వారియర్స్, పీబీ కల్ట్స్ అనే ఫ్యాన్ పేజీలో కల్కి ఓటీటీ రిలీజ్ డేట్ పోస్టర్ దర్శనమిచ్చింది. దీని ప్రకారం నెట్ ఫ్లిక్స్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలనూ ఈ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.అమెజాన్ ప్రైమ్‌లో తెలుగుతోపాటు దక్షిణాది భాషల్లో కల్కి స్ట్రీమింగ్ కానుంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రసారం చేయనున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమాలో ప్రభాస్ సరసన హిందీ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె నటించింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ తదితరులు క్యామియో రోల్స్ లో మెరిశారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు రూ. 700 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కల్కి సినిమాను నిర్మించారు.

ఇవి కూడా చదవండి

త్వరలోనే అధికారిక ప్రకటన..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.