AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithin’s Maestro: నితిన్ మాస్ట్రో మూవీ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్… డిజిటల్ లో రిలీజ్ కు రంగం సిద్ధం..?

Nithin's Maestro:దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ.. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించింది. దీంతో ఎక్కడ చూసినా క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణ‌మే​.

Nithin's Maestro: నితిన్ మాస్ట్రో మూవీ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్... డిజిటల్ లో రిలీజ్ కు రంగం సిద్ధం..?
Nitin Mastro
Surya Kala
|

Updated on: Jun 01, 2021 | 5:04 PM

Share

Nithin’s Maestro:దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ.. పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించింది. దీంతో ఎక్కడ చూసినా క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణ‌మే​. దర్శనమిస్తుంది. దీంతో సినిమాల రిలీజ్ గురించి ఆలోచించడం కష్టమే.. అయితే సినీ ప్రియులకు ఓటిటి రూపంలో మంచి వినోద సాధనం అందుబాటులోకి వచ్చింది. కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా సినిమాలను థియేటర్స్ లో రిలీజ్ చేసే అవకాశం లేకపోవడంతో సూర్య వంటి స్టార్ హీరోలతో పాటు అనేక చిన్న సినిమాలు కూడా ఓటిటి లో రిలీజై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి., తాజాగా నితిన్ మూవీ కూడా ఓటిటి లో రిలీజ్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.

గత ఏడాది లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత నితిన్ చెక్ , రంగ్ దే సినిమాలు థియేటర్స్ లో సందడి చేశాయి. అయితే ప్రస్తుతం నితిన్ మరో మూవీ మాస్ట్రో సెట్స్ మీద ఉంది. ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ ‘అంధాధూన్’కు ఇది రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మిల్కిబ్యూటీ తమన్నా ఓ కీలక పాత్రను పోషిస్తుండగా … నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ దీనికి సమర్పకుడు. మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం కేవలం ఏడు రోజుల షూటింగ్ మాత్రం బాలెన్స్ ఉందట. . జూన్​ రెండో వారంలో షూటింగ్​ పూర్తి చేసి.. ఇదే నెలలో సినిమాను రిలీజ్​ చేయడానికి చిత్రబృందం ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మాస్ట్రో మూవీకి ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడిందట. ఓ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో ‘మ్యాస్ట్రో’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారని టాక్​ వినిపిస్తోంది. అయితే… దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే విడుదలైన నితిన్ ఫస్ట్​లుక్​, గ్లింప్స్​కు మంచి స్పందన లభిస్తోంది.

Also Read: కరోనా బాధితులు ఊపిరితిత్తులకు సింపుల్ చిట్కాలతో ఊపిరినివ్వండి ఇలా…!

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!