Leo Movie: ‘లియో’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు కన్ఫార్మ్ చేసిన నెట్‌ఫ్లిక్స్.. ఎప్పుడంటే..
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్ దళపతితో జోడీ కట్టింది త్రిష. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించిన సినిమాగా నిలిచింది. అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.550 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో దళపతి విజయ్ ఒకరు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. విజయ్ నటించిన సినిమాలన్ని తెలుగులోకి డబ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వారసుడు మూవీతో నేరుగా తెలుగు అడియన్స్ ను పలకరించాడు. ఇక కొద్దిరోజుల క్రితం లియో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత విజయ్ దళపతితో జోడీ కట్టింది త్రిష. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించిన సినిమాగా నిలిచింది. అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.550 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీపై అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఈ సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తుందని అనుకున్నారంత. నిజానికి ఈ మూవీ నవంబర్ 16 అంటే ఈరోజు నుంచే స్ట్రీమింగ్ అవుతుందనుకున్నారు. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా లియో ఓటీటీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసింది నెట్ ప్లిక్స్. ఈ సినిమాను నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నవంబర్ నెలలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల జాబితాను రివీల్ చేసింది. అందులో భాగంగానే విజయ్ దళపతి నటించిన లియో సినిమా స్ట్రీమింగ్ డేట్ సైతం వెల్లడించింది.
View this post on Instagram
ఇక రేపు నవంబర్ 17న Scott pilgrim takes off G.I.Joe సినిమా స్ట్రీమింగ్ కానుంది. అలాగే నవంబర్ 18న ది రైల్వే మెన్, నవంబర్ 20న రిక్ అండ్ మోర్టీ, నవంబర్ 21న లియో, నవంబర్ 22న స్కైడ్ గేమ్ ది ఛాలెంజ్, నవంబర్ 23న మై డెమోన్, నవంబర్ 27నరిక్ అండ్ మోర్టీ, నవంబర్ 30న ది బ్యాడ్ గాయ్స్ ఫ్యామిలీ స్విచ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఇక లియో సినిమా అప్డేట్ కోసం ఇన్నాళ్లు ఎదురుచూసిన ఫ్యాన్స్ ఇప్పుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.