చాలా గ్యాప్ తర్వాత నారా రోహిత్ కథానాయకుడిగా కనిపించిన సినిమా ప్రతినిధి 2. సుమారు పదేళ్ల క్రితం రిలీజై సంచలన విజయం సాధించిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా ఇది తెరకెక్కింది. మూర్తి దేవగుప్తపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. పార్ట్ 1 సూపర్ సక్సెస్ కావడంతో. పార్ట్ 2 టీజర్, ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండడంతో ప్రతినిధి 2పై బాగానే హైప్ క్రియేట్ అయ్యింది. అయితే అభిమానుల అంచనాలు అందుకోవడంలో ప్రతనిధి 2 సినిమా ఫెయిల్ అయ్యింది. మే 10న థియేటర్లలో విడుదలైన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోయింది. దీంతో చాలా మంది ఓటీటీలో చూద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే థియేటర్లలో రిలీజైన ఇన్ని రోజులకు గానీ ప్రతినిధి 2 సినిమా ఓటీటీలోకి రాలేదు. అయితే ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అప్ డేట్ వచ్చింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఓటీటీ నారా రోహిత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ హక్కులను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 27 నుంచి ప్రతినిధి2 సినిమాను ఓటీటీలోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. ‘ప్రశ్నించేందుకు ప్రతినిధి 2 వస్తున్నాడు. ఆహాలోసెప్టెంబర్ 27 నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుంది’ అని సినిమా పోస్టర్ ను పంచుకుంది ఆహా.
కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ప్రతినిధి 2 సినిమాను నిర్మించారు. నారా రోహిత్‌తో పాటు సిరీ లెల్ల,సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, పృధ్వీ రాజ్, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీకి సంగీతం అందించాడు.
Prasninchenduku
Prathinidi-2 vasthunnadu!Premieres 27th September on aha!#prathinidi2 @IamRohithNara @murthyscribe @VanaraEnts @SagarMahati @kumarraja423 @TSAnjaneyulu1 #aha pic.twitter.com/VO2XdzwXTl
— ahavideoin (@ahavideoIN) September 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.