థాంక్యూ తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కస్టడీ’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాలో కృతిశెట్టి కథానాయికగా నటించింది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి కస్టడీ సినిమాను నిర్మించారు. ఇప్పటివరకు ఎక్కువగా లవర్‌బాయ్‌గానే కనిపించిన చైతూ ఇందులో మొదటిసారిగా పోలీస్‌గా కనిపించారు. మే 12 న థియేటర్లలో విడుదలైన కస్టడీ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఓ మోస్తరుగా మాత్రమే వసూళ్లు వచ్చాయి. అయితే కాప్ పాత్రలో నాగచైతన్య యాక్టింగ్ అదిరిపోయింది. అలాగే సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, డైరెక్టర్ వెంకట్ ప్రభు టేకింగ్ చాలా బాగున్నాయని రివ్యూస్ వచ్చాయి. దీంతో అక్కినేని అభిమానులు కస్టడీ ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూడసాగారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ‘కస్టడీ’ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇక బుధవారం (జూన్ 7) నాగచైతన్య సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈక్రమంలో జూన్ 9 (శుక్రవారం అర్ధరాత్రి) నుంచే కస్టడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కస్టడీ సినిమా అందుబాటులో ఉంది. ఈ మూవీలో తమిళ సీనియర్ నటుడు అరవింద్ స్వామి ప్రధాన పాత్ర పోషించగా.. వెన్నెల కిషోర్, సంపత్ రాజు, శరత్ కుమార్, ప్రియమణి, ప్రేమ్‌జీ అమరన్ తదితరులు కీలక పాత్రలు కనిపించారు. అలాగే ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. మరి థియేటర్లలో కస్టడీ సినిమాను మిస్ అయినవారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Yuvasamrat @chay_akkineni ‘s #Custody is now Streaming on @PrimeVideoIN ?
It’s time for the binge-watch of seat edge thrilling @vp_offl hunt !@IamKrithiShetty @thearvindswami @realsarathkumar @ilaiyaraaja @thisisysr @vennelakishore @Premgiamaren @SS_Screens pic.twitter.com/6UVpuBBBlR
— Naga Chaitanya FC (@ChayAkkineni_FC) June 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.