‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా, హరీష్ కల్యాణ్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఎల్‌జీమ్ (లెట్స్ గెట్ మ్యారీడ్). టీమిండియా మాజీ కెప్టెన్, ఎం ఎస్ ధోని నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన మొదటి సినిమా ఇది. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై ధోని సతీమణి సాక్షి నిర్మించిన ఈ మూవీలో నదియా, యోగిబాబు, ఆర్జే విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రమేశ్ తమిళ్‌మణి దర్శకత్వం వహించారు. ఎం ఎస్ ధోని నిర్మించిన సినిమా కావడంతో రిలీజకు ముందు ఎలీజ్‌ఎమ్‌పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. టీజర్లు, పోస్టర్లు, ట్రైలర్ కూడా ఆసక్తిని రేకెత్తించాయి. అయితే అంచనాలను అందుకోవడంలో ఎల్‌జీఎమ్ ఫెయిల్ అయ్యింది. జులై 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఆగస్టు 4న తెలుగు వెర్షన్ రిలీజ్ కాగా ఇక్కడ కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వసూళ్లు కూడా రాలేదు. సబ్జెక్టు ఆసక్తికరంగానే ఉన్నా, అందుకు తగ్గట్టుగా ఎమోషన్స్ వర్కవుట్ కావడంతో ఎల్‌జీఎమ్ ప్లాఫ్‌గా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. నాలుగు రోజుల క్రితమే ఎల్ జీ ఎమ్ తమిళ్ వెర్షన్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది . తాజాగా తెలుగు వెర్షన్ కూడా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ఎల్‌జీఎమ్ సినిమాకు డైరెక్టర్ రమేష్ తమిళమణినే స్వరాలు సమకూర్చడం విశేషం. ప్రదీప్ ఇ రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, విశ్వజిత్ ఒడుక్కతిల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఇక ఎల్‌జీఎమ్ సినిమా కథ విషయానికొస్తే.. మీరా (ఇవానా), గౌతమ్ (హరీష్ కల్యాణ్) ప్రేమించుకుంటారు. గౌతమ్ పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మ (నదియా)తో కలిసి ఉండాలనుకుంటాడు. అయితే మీరాకు అది ఇష్టం ఉండదు. దీంతో మీరాకు, తన తల్లికి మధ్య మంచి అనుబంధం ఏర్పడేందుకు కూర్గ్ ట్రిప్ ప్లాన్ వేస్తాడు హీరో. మరి కాబోయే అత్తతో మీరా కలిసిపోయిందా? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటో తెలుసుకోవాలంటే ఎల్‌జీఎమ్ సినిమా చూడాల్సిందే.
MS Dhoni’s debut film production – #LetsGetMarried now streaming on Amazon Prime. pic.twitter.com/zjUWmWlBvF
— Siddarth Srinivas (@sidhuwrites) September 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.