AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: చిరు ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా ?.. ఆమెలో చిరంజీవికి నచ్చినవి అవే..

అలాగే తన సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన హీరోయిన్స్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు చిరు. రాధ, విజయశాంతి, రాధిక, మాధవి, శ్రీదేవి వంటి అగ్రకథానాయికల గురించి చెప్పుకొచ్చారు.

Megastar Chiranjeevi: చిరు ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా ?.. ఆమెలో చిరంజీవికి నచ్చినవి అవే..
Megastar Chiranjeevi
Rajitha Chanti
|

Updated on: Feb 11, 2023 | 6:40 PM

Share

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా, కీర్తి సురేష్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇటీవల ఆయన సింగర్ స్మిత వ్యాఖ్యతగా నిర్వహిస్తోన్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్నారు. ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోలో చిరంజీవి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నారు. ఫిబ్రవరి 10న చిరు ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేశారు. ఆయన జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గురించి గుర్తుచేసుకున్నారు.అలాగే తన సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన హీరోయిన్స్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు చిరు. రాధ, విజయశాంతి, రాధిక, మాధవి, శ్రీదేవి వంటి అగ్రకథానాయికల గురించి చెప్పుకొచ్చారు.

అప్పట్లో చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న వారి గురించి స్మిత ప్రశ్నించారు. రాధికా శరత్ కుమార్.. రాధ, విజయశాంతి, శ్రీదేవి లాంటి స్టార్లలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడానికి మెగాస్టార్ చిరంజీవి నిరాకరించారు. అందరితోనూ తనకు మంచి రిలేషన్ ఉందని.. మా మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని అన్నారు. వారిలో ఒక్కొక్కరికీ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. రాధిక సహజంగా నటించేస్తోందని అన్నారు.

అలాగే తనతో డాన్స్ చేసే విషయంలో రాధ పర్ఫెక్ట్ అని.. తన పాత్రలో తనను తాను మార్చుకునే గొప్పతనం విజయశాంతి సొంతం అన్నారు. అలాగే రాధ, విజయశాంతి డాన్స్ ఫవర్ ఫుల్ గా ఉంటుందన్నారు. అలాగే శ్రీదేవితో గొప్ప.. వ్యక్తిగత.. వృత్తిపరమైన రిలేషన్ పంచుకున్నానని తెలిపారు. అందుకే ఆమె ఎప్పుడూ తన ఫేవరేట్ హీరోయిన్ అని అన్నారు. శ్రీదేవితో పనిచేసి ప్రతి క్షణాన్ని ఆస్వాదించా…తెలుగు సినిమాల్లో తమ జంట ఇప్పటికీ కూడా ఉత్తమ జంటగానే ఉంటుందన్నారు. శ్రీదేవి నటన, డాన్స్ బెస్ట్. అందుకే ఆమెతో జగదేక వీరుడు అతిలోక సుందరి, మోసగాడు, ఎస్పీ పరశురామ్ చిత్రాల్లో నటించానని అన్నారు చిరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.