Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్‏లో మెగాస్టార్ సందడి.. ఊ అంటావా పాట పాడి అదరగొట్టిన చిరు..

| Edited By: Ravi Kiran

Jun 13, 2022 | 8:32 PM

సంగీత ప్రియుల మధ్య గణనీయమైన ఆదరణ పొందిన తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో చివరి దశకు చేరుకుంది. దాదాపు 15 వారాలు జరిగిన ఈ సంగీత ప్రయాణం ఇప్పుడు ఆఖరి ఘట్టానికి చేరుకుంది..

Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్‏లో మెగాస్టార్ సందడి.. ఊ అంటావా పాట పాడి అదరగొట్టిన చిరు..
Telugu Indian Idol
Follow us on

సినీ ప్రియులకు వందశాతం వినోదాన్ని అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకుపోతుంది ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా (Telugu Indian Idol). సూపర్ హిట్ చిత్రాలు మాత్రమే కాకుండా సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్, టాక్ షోస్, గేమ్ షోస్ అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ఓటీటీ వేదికపై సంగీత సుస్వరాల వేదిక తెలుగు ఇండియన్ ఐడల్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. సంగీత ప్రియుల మధ్య గణనీయమైన ఆదరణ పొందిన తెలుగు ఇండియన్‌ ఐడల్‌ షో చివరి దశకు చేరుకుంది. దాదాపు 15 వారాలు జరిగిన ఈ సంగీత ప్రయాణం ఇప్పుడు ఆఖరి ఘట్టానికి చేరుకుంది.. సోమవారం హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. ఈ ఈవెంట్‌కు గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.

తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలేకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. స్జేట్ పై స్టెప్పులేసి అలరించారు.. అంతేకకాకుండా.. కంటెస్టెంట్ ప్రణతి వాళ్ల అమ్మతో కలిసి సందెపోగులా కాడా అని పాట పాడుతూ స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు. అలాగే మరో కంటెస్టెంట్ శ్రీనివాస్ గాత్రానికి ఫిదా అయ్యి..తానే తెలుగు ఇండియన్ ఐడల్ డైరెక్టర్ చేస్తా అన్నారు. ఇక జయంత్ పాడిన పాటకు ఖైదీ 150 సినిమా ట్యూన్ కు సిగ్నేచర్ స్టెప్ వేసి.. అతనికి తన కూలింగ్ గ్లాస్ కానుకగా ఇచ్చారు. ఇలా ఒక్కటేమిటీ.. తెలుగు ఐండియన్ ఐడల్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజీవి చేసిన సందడి వెరేలెవల్ అని చెప్పుకొవాలి.. మెగాస్టార్ చిరంజీవితోపాటు విరాటపర్వం చిత్రయూనిట్.. సాయి పల్లవి, రానా దగ్గుబాటి సైతం తెలుగు ఇండియన్ ఫినాలేలో సందడి చేశారు. చిరు చేసిన ఎంటర్టైన్మెంట్ చూడాలంటే తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలే కోసం వేచి చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. ఈ షో జూన్ 17న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.