Manjummel Boys OTT: బ్లాక్ బస్టర్ మూవీ ‘ముంజుమెల్ బాయ్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

|

Apr 10, 2024 | 6:52 PM

మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై సంచలనం సృష్టించిన సినిమా మంజుమెల్ బాయ్స్. ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఏకంగా రూ. 200 కోట్లుకు పైగా వసూళ్లను రాబట్టిందీ మూవీ. మలయాళంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మంజుమెల్ బాయ్స్ ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదలైంది

Manjummel Boys OTT: బ్లాక్ బస్టర్ మూవీ ముంజుమెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Manjummel Boys Movie
Follow us on

మలయాళంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై సంచలనం సృష్టించిన సినిమా మంజుమెల్ బాయ్స్. ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఏకంగా రూ. 200 కోట్లుకు పైగా వసూళ్లను రాబట్టిందీ మూవీ. మలయాళంలో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మంజుమెల్ బాయ్స్ ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదలైంది. ఏప్రిల్ 6న విడుదలైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఇక్కడ కూడా అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. కాగా ముంజుమెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. అయిత థియేట్రికల్ రిలీజులు ఉండడంతో అంతకంతకూ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందంటూ ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు. అయితే ఇప్పుడు ముంజుమెల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ డేట్ పై మళ్లీ బజ్ వచ్చింది. ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందో సమాచారం బయటికి వచ్చింది. మంజుమెల్ బాయ్స్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 3వ తేదీ నుంచి ఈ సర్వైవర్ థ్రిల్లర్ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఆ రోజున మలయాళం, తెలుగుతో పాటు మరిన్ని దక్షిణాది భాషల్లోనూ ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తున్నారని టాక్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం

కాగా మలయాళంలో రూ.200 కోట్ల వసూళ్లను సాధించిన మొదటి సినిమాగా ముంజుమెల్ బాయ్స్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ సినిమాకు రూ.226 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయి. సినిమా కథ విషయానికి వస్తే.. యదార్థ సంఘటన ఆధారంగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ తెరకెక్కింది. కోడైకెనాల్ లోని ఒక గుహను చూడటానికి కేరళ నుండి స్నేహితుల బృందం విహార యాత్ర కు వెళతారు. అయితే స్నేహితుల్లో ఒకరు గుహలో పడిపోతారు. ఆ యువకుడిని ఆ బృందం ఎలా కాపాడుతుంది, వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఎలా ఎదుర్కొంటాన్నదే మంజుమ్మెల్ బాయ్స్ సినిమా.

ఇవి కూడా చదవండి

మే 3 నుంచి ఓటీటీలో అందుబాటులోకి

స్టార్ హీరోల ప్రశంసలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.