Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thundu Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో మలయాళీ హిట్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..

ఇటీవల విడుదలైన భ్రమయుగం, ప్రేమలు, మంజుమల్ బాయ్స్ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ భాషలలోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే తుండు. రణం, ఖతర్నాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు బిజు మీనన్. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా తుండు.

Thundu Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో మలయాళీ హిట్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..
Thundu Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 17, 2024 | 8:13 AM

ఇటీవలి కాలంలో మలయాళీ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. చిన్న సినిమాలుగా రిలీజ్ అవుతూ అతి పెద్ద విజయాన్ని అందుకుంటున్నాయి. మలయాళీ యంగ్ డైరక్టర్స్, మేకర్స్ ఇప్పుడు సరికొత్త కంటెంట్ అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. రోజూవారీ జీవితంలో ఎదురైన చిన్న చిన్న సంఘటనలను.. అంశాలను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల విడుదలైన భ్రమయుగం, ప్రేమలు, మంజుమల్ బాయ్స్ చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ భాషలలోకి డబ్ అయ్యి సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే తుండు. రణం, ఖతర్నాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు బిజు మీనన్. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా తుండు.

ఈ చిత్రానికి నూతన దర్శకుడి రియాజ్ షరీష్ దర్శకత్వం వహించగా.. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆషిక్ ఉస్మాన్, జిమ్షీ ఖలీద్‌లు నిర్మించారు. ఇందులో ఉన్నియ ప్రసాద్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలు పోషించారు. పోలీసుల కథతో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మలయాళ ఒరిజినల్‌తో పాటు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమా మొత్తం ఒక కానిస్టేబుల్ జీవితం చుట్టూ తిరుగుతుంటుంది. ఉద్యోగంలో పదోన్నతి కోసం నిజాయితీగా పనిచేసే అతడి జీవితంలో ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. దీంతో అతడు అనేక సమస్యలలో చిక్కుకుంటాడు. అయితే కథలో బలం ఉన్నప్పటికీ అంతగా మెప్పించలేకపోయింది. ఈ సినిమాలో నటీనటులు.. మేకింగ్ పై అడియన్స్ పెదవి విరిచారు. అలాగే పోలీసు స్టోరీ కావడంతో ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. కానీ పోలీసులు కథలు ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తలనొప్పేగా అనుకునేరు.. ఈ ప్రమాదకర వ్యాధుల లక్షణం కూడా కావొచ్చు
తలనొప్పేగా అనుకునేరు.. ఈ ప్రమాదకర వ్యాధుల లక్షణం కూడా కావొచ్చు
సమయాన్ని ఇలా నిర్వహిస్తే సక్సెస్ మీ సొంతం అంటున్న చాణక్య
సమయాన్ని ఇలా నిర్వహిస్తే సక్సెస్ మీ సొంతం అంటున్న చాణక్య
IND vs AUS: తొలి సెమీస్‌లో బద్దలైన వ్యూవర్ షిప్ రికార్డ్..
IND vs AUS: తొలి సెమీస్‌లో బద్దలైన వ్యూవర్ షిప్ రికార్డ్..
రోహిత్‌ శర్మ ఫెల్యూర్స్‌పై స్పందించిన హెడ్‌ కోచ్‌ గంభీర్‌!
రోహిత్‌ శర్మ ఫెల్యూర్స్‌పై స్పందించిన హెడ్‌ కోచ్‌ గంభీర్‌!
తెల్ల చీరలో ఎంత ముద్దుగుందో.. పాలరాతి శిల్పంలా మానుషి చిల్లర్!
తెల్ల చీరలో ఎంత ముద్దుగుందో.. పాలరాతి శిల్పంలా మానుషి చిల్లర్!
చందమామ మీద సూర్యోదయం చూశారా?
చందమామ మీద సూర్యోదయం చూశారా?
స్టైలిష్ లుక్‌లో ఊర్వశి రౌటెలా.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్!
స్టైలిష్ లుక్‌లో ఊర్వశి రౌటెలా.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్!
3 మార్పులతో ఫైనల్ బరిలోకి రోహిత్ సేన.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే
3 మార్పులతో ఫైనల్ బరిలోకి రోహిత్ సేన.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే
ఆ పేపర్లపై హాల్‌టికెట్ ప్రింట్ తీస్తే అనుమతి రద్దు.. ఇంటర్ బోర్డు
ఆ పేపర్లపై హాల్‌టికెట్ ప్రింట్ తీస్తే అనుమతి రద్దు.. ఇంటర్ బోర్డు
కీర్తి సురేష్ కోసం నెక్లెస్‌ను రూపొందించిన జోస్ ఆలుక్కాస్..
కీర్తి సురేష్ కోసం నెక్లెస్‌ను రూపొందించిన జోస్ ఆలుక్కాస్..