OTT Movies
కొంత గ్యాప్ తర్వాత మళ్లీ థియేటర్లలో పెద్ద సినిమాల సందడి మొదలైంది. ఈ వారం ఎన్టీఆర్ దేవర గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో తెలుగులో ఇతర సినిమాలేవీ థియేటర్లలోకి రావడం లేదు. అయితే హిట్లర్, సత్యం సుందరం అనే డబ్బింగ్ సినిమాలు మాత్రం రిలీజ్ కానున్నాయి. ఇక ఓటీటీలోనూ ఈ వారం పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయాయి. ఈ వీక్ అందరి దృష్టి నాని నటించిన సరిపోదా శనివారం సినిమాపైనే ఉంది. థియేటర్లలో 100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టిన ఈ మూవీ ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. అలాగే డిమోంటీ కాలనీ 2, శోభిత ధూళిపాళ లవ్ సితార, శ్రద్ధా కపూర్ స్త్రీ2 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేసేందుకు సిద్ధమైపోయాయి. వీటితో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషలకు చెందిన పలు సినిమాలు, క్రేజీ వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు/సిరీస్‌లు వస్తున్నాయో ఒక లుక్కేద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్
- పెనెలోప్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 24
- బ్యాంకాక్ బ్రేకింగ్ (థాయ్ సినిమా) – సెప్టెంబరు 26
- నోబడీ వాంట్స్ దిస్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 26
- సరిపోదా శనివారం (తెలుగు సినిమా) – సెప్టెంబరు 26
- గ్యాంగ్ సీయాంగ్ క్రియేచర్ సీజన్ 2 (కొరియన్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 27
- రెజ్ బాల్ (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 27
- విల్ & హార్పర్ (ఇంగ్లిష్ మూవీ) – సెప్టెంబరు 27
అమెజాన్ ప్రైమ్ వీడియో
- స్కూల్ ఫ్రెండ్స్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 25
- స్త్రీ 2 (హిందీ సినిమా) – సెప్టెంబరు 27 (రూమర్ డేట్)
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- వాళా (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 23
- 9-1-1: లోన్ స్టార్ సీజన్ 5 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 24
- ఇన్ సైడ్ ఔట్ 2 (ఇంగ్లిష్ సినిమా) – సెప్టెంబరు 25
- గ్రోటస్క్వైరీ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 26
- అయిలా వై లాస్ మిర్రర్ (స్పానిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 27
- తాజా ఖబర్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 27
ఆహా
- బ్లింక్ (తమిళ డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 25
జీ5
- డీమోంటీ కాలనీ 2 (తెలుగు సినిమా) – సెప్టెంబరు 27
- లవ్ సితార (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 27
ఆపిల్ ప్లస్ టీవీ
- మిడ్ నైట్ ఫ్యామిలీ (స్పానిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 25
జియో సినిమా
- హానీమూన్ ఫొటోగ్రాఫర్ (హిందీ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 27
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.