KTR : కేటీఆర్ సార్ ఈ సినిమాలు చూడండి.. మంత్రికి నెటిజన్లు సూచించినవి ఇవే
సాధారణంగా ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకునే సమయంలో మనకు టైం పాస్ అవ్వడాకిని బెస్ట్ ఛాయిస్ ఓటీటీ. గ్యాప్ దొరికితే చాలు అందరు కుదిరితే టీవీల్లో, లేదంటే ఫోన్ లలో ఓటీటీలో రకరకాల సినిమాలు, సిరీస్ లు చూస్తూ గడిపేస్తున్నారు
సాధారణంగా ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకునే సమయంలో మనకు టైం పాస్ అవ్వడాకిని బెస్ట్ ఛాయిస్ ఓటీటీ. గ్యాప్ దొరికితే చాలు అందరు కుదిరితే టీవీల్లో, లేదంటే ఫోన్ లలో ఓటీటీలో రకరకాల సినిమాలు, సిరీస్ లు చూస్తూ గడిపేస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్(KTR ) కూడా అదే పని చేస్తున్నారు. నిన్న మొన్నటికి వరకు ప్రజానాయకుడిగా తీరిక లేకుండా గడిపేసిన కేటీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కేటీఆర్ కాలికి చిన్న గాయం అయిన విషయం తెల్సిందే. గాయం కారణంగా కేటీఆర్ ఇంటికే పరిమితం అయ్యారు. దాంతో ఏమీ తోచక టైం పాస్ అవ్వడానికి ఏదైనా ఓటీటీ సినిమాను చెప్పండి అని తన అభిమానులను సోషల్ మీడియా ద్వారా అడిగారు. కేటీఆర్ అడగడమే ఆలస్యం ఆయన ట్వీట్ కు వందల కొద్దీ కామెంట్లు వచ్చి పడుతున్నాయి. అన్న మీరు త్వరగా కోలుకోవాలి అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
రకరకాల సినిమా పేర్లను సూచిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కేటీఆర్ తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ వాడిన క్లౌడ్ బరస్ట్ అనే పదాన్ని పట్టుకొని.. ఆ సినిమా చూడాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు కొరియన్ సిరీస్ లను , మరికొందరు హాలీవుడ్ సిరీస్ లు, సినిమాల పేర్లు చెప్తున్నారు. డార్క్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, మనీ హైస్ట్, ది బాయ్స్, వర్జిన్ రివర్, డీకపుల్డ్, ఒజార్క్, బెటర్ కాల్ సాల్, స్ట్రేంజర్ థింగ్స్, డెసిగ్నేటెడ్ సర్వైవర్ వంటివి చూడాలని సూచుస్తున్నారు. మరికొంతమంది ఎఫ్ 3, సన్ ఆఫ్ ఇండియా, మోడ్రన్ లవ్ స్టోరీ, పరంపర, సర్కారు వారి పాట లాంటి సినిమాలను చూడాలంటూ సూచిస్తున్నారు. ఇక కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ప్రజల సమస్య పై ఎప్పటికప్పుడు కేటీఆర్ స్పందిస్తూ ఉంటారు.
Had a fall today & ended up tearing my ankle ligament. Been advised 3 weeks of rest ?
Any advise on binge worthy OTT shows? pic.twitter.com/sWat7eCkWX
— KTR (@KTRTRS) July 23, 2022