
ఈమధ్య కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో సరికొత్త కంటెంట్ చిత్రాలు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. రొమాంటిక్, థ్రిల్లర్, మిస్టరీ, హారర్ సినిమాలకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. నిత్యం ఎన్నో రకాల కంటెంట్ మూవీ అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు నెలరోజుల్లోనే ఓటీటీ లవర్స్ ముందుకు వస్తున్నాయి. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన చిత్రాలు ఓటీటీలో సత్తా చాటుతున్నాయి. థియేటర్లలో బొక్క బోర్లా పడ్డ సినిమాలు.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో దుమ్మదులుపుతున్నాయి. ప్రస్తుతం ఆ రెండు సినిమాలో ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది ఒకే రోజు థియేటర్లలో విడుదలైన సినిమాలు ఓటీటీ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందామా.. అవే ఎమర్జెన్సీ.. ఆజాద్.
ఎమర్జెన్సీ..
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన హిస్టారికల్ పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కనిపించింది కంగనా. జనవరి 17న విడుదలైన సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.22 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం ఈసినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీ టాప్ 3 ట్రెండింగ్ ప్లేస్ లో ఎమర్జెన్సీ సినిమా దూసుకుపోతుంది. ఈ చిత్రానికి ఐఎమ్డీబీ 5.2 రేటింగ్ ఇచ్చింది.
ఆజాద్..
ఇక ఇదే ఏడాది విడుదలై థియేటర్లలో డిజాస్టర్ అయిన మరో సినిమా ఆజాద్. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈసినిమాలో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ హీరోగా నటించారు. ఇందులో సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడానీ కథానాయికగా నటించింది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా.. రూ.10 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఓటీటీ టాప్ 4 ట్రెండింగ్ లో స్థానం సంపాదించుకుంది. థియేటర్లలో డిజాస్టర్స్ అయిన ఈ సినిమాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..