తెలుగు ఆడియెన్స్ అమితంగా ఇష్టపడే కోలీవుడ్ స్టార్ హీరోల్లో కార్తీ ముందుంటాడు. అందుకే అతని సినిమాలు తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కార్తీ నటించిన లేటెస్ట్ సినిమా మైయళగన్. తెలుగులో సత్యం సుందరం గా రిలీజైంది.
ఎన్టీఆర్ దేవర బరిలో ఉన్నా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మరీ ఈ సినిమాను తెలుగు ఆడియెన్స్ ముందుకు తెచ్చారు. దేవర రిలీజ్ తర్వాత మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 28న థియేటర్లలో రిలీజైన ఈ సత్యం సుందరం సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది.
సినిమా చూసినోళ్లందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. రివ్యూలు సైతం పాజిటివ్ గా వచ్చాయి. అయితే థియేటర్లలో ఎక్కువగా దేవర ఉండడంతో ఈ ఫీల్ గుడ్ మూవీ చాలామందికి రీచ్ కాలేకపోయింది. అలాంటి వారి కోసం సత్యం సుందరం ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అక్టోబర్ 25 నుంచే ఈ సూపర్ హిట్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం అర్ధరాత్రి నుంచే సత్యం సుందరం సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
సత్యం సుందరం సినిమాని సూర్య, జ్యోతికలు నిర్మించగా తెలుగులో ఆసియన్ సురేష్ రిలీజ్ చేశారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. సత్యం (అరవింద స్వామి) అనే వ్యక్తి కొన్ని పరిస్థితుల వల్ల సొంతూరిని వదిలిపెట్టి వెళ్లిపోతాడు. చిన్నాన్న కూతురు పెళ్లి కోసం దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత అదే ఊరికి తిరిగి వస్తాడు. ఆ పెళ్లిలో సుందరం (కార్తి) బావ అని తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి ప్రయాణం ఎలా సాగిందన్నదే సినిమా. థియేటర్లలో ఈ ఫీల్ గుడ్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఓటీటీలో మాత్రం మిస్ అవద్దు.
Potti erangiyaachuuuuu! Meiyazhagan ippo Netflix la vandhaachu!🫶❤️
Watch Meiyazhagan now on Netflix in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi!#MeiyazhaganOnNetlfix pic.twitter.com/CFzzgbH5Qg— Netflix India South (@Netflix_INSouth) October 25, 2024
Our Heartfelt gratitude for the overwhelming response from the press!! #SathyamSundaram belongs to you all from today! 😊@thearvindswami #PremKumar @Suriya_offl #Jyotika @2D_ENTPVTLTD @rajsekarpandian #Rajkiran @SDsridivya #GovindVasantha #MahendiranJayaraju #Rajeevan… pic.twitter.com/2LwIjx9W0q
— Karthi (@Karthi_Offl) September 28, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.