- Telugu News Photo Gallery Cinema photos Audience Waiting For unstoppable With NBK Season 4 First Episode in Aha, Details here Telugu Heroes Photos
UNstoppable 4: బాలయ్య ఎనర్జీకి సూర్య ఫిదా.! ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపులకు బ్రేక్..
ఆరు పదుల వయసులో ఆయన డిసిప్లిన్, డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయా అంటూ నందమూరి బాలకృష్ణ గురించి చెప్పారు నడిప్పిన్ నాయగన్ సూర్య. అన్‌స్టాపబుల్ షో కోసం బాలయ్యతో ముచ్చటించారు సూర్య.. కంగువ గురించి బాలయ్య గురించి చాలా విషయాలు పంచుకున్నారు. నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4 కోసం ఎదురుచూపులు మామూలుగా లేవు. అక్టోబర్ 25 రాత్రి 8.30 ఎప్పుడెప్పుడు అవుతుందా? ఫస్ట్ పార్టులో ఏమేం విషయాలుంటాయా?
Updated on: Oct 25, 2024 | 6:54 PM

ఆరు పదుల వయసులో ఆయన డిసిప్లిన్, డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయా అంటూ నందమూరి బాలకృష్ణ గురించి చెప్పారు నడిప్పిన్ నాయగన్ సూర్య.

అన్‌స్టాపబుల్ షో కోసం బాలయ్యతో ముచ్చటించారు సూర్య.. కంగువ గురించి బాలయ్య గురించి చాలా విషయాలు పంచుకున్నారు. నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 4 కోసం ఎదురుచూపులు మామూలుగా లేవు.

అక్టోబర్ 25 రాత్రి 8.30 ఎప్పుడెప్పుడు అవుతుందా? ఫస్ట్ పార్టులో ఏమేం విషయాలుంటాయా? అనే ఆసక్తి వరల్డ్ వైడ్‌గా క్రియేట్ అయింది. లేటెస్ట్ గా కంగువ ప్రమోషన్లలో అన్‌స్టాపబుల్ గురించి మాట్లాడారు సూర్య.

ఇప్పటిదాకా బాలయ్యతో చాలా సార్లు మాట్లాడినా, ఇంత సుదీర్ఘంగా ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. తెల్లారుజామున 3.30కి నిద్రలేచే బాలయ్య, అంత ఎనర్జిటిక్‌గా ఎలా ఉండగలుగుతున్నారోనని ఆశ్చర్యపోయానన్నారు.

అంతే కాదు.. నందమూరి బాలకృష్ణ డిసిప్లిన్‌కి ఫిదా అయిపోయారు కంగువ స్టార్. సూర్య హీరోగా నటించిన కంగువ నవంబర్ 14న రిలీజ్ అవుతోంది. ఇలాంటి సినిమాలు చేయాలంటే భయం వేస్తుంది.

కానీ.. ఇన్నేళ్ల ఎక్స్ పీరియన్స్ తర్వాత భయపడటం తగదని, ఈ స్క్రిప్ట్ ని యాక్సెప్ట్ చేశారట సూర్య. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు చూసి వారెవా.. మనం చేయలేమా అనుకునేవాళ్లమని గుర్తుచేశారు నడిప్పిన్ నాయగన్.

రాజమౌళి బాహుబలితో ముందడుగు వేసి,మన సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రాచబాట వేశారని చెప్పారు.




