Shakhahaari Movie: ఊహించని ట్విస్టులతో దిమ్మతిరిగే మర్డర్ మిస్టరీ.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే..

|

Aug 24, 2024 | 11:01 AM

సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హనుమాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాత బాలు చరణ్ తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మర్డరీ మిస్టరీ నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీకి కన్నడలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆద్యంతం ఊహించని ట్విస్టులు.. సస్పెన్స్ థ్రిల్లర్‏గా తెరకెక్కించిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Shakhahaari Movie: ఊహించని ట్విస్టులతో దిమ్మతిరిగే మర్డర్ మిస్టరీ.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే..
Shakhahaari Movie
Follow us on

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో వరుసగా మంచి మంచి డబ్బింగ్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోని సూపర్ హిట్ చిత్రాలను డబ్బింగ్ చేసి ఆహాలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే అనేక చిత్రాలు సినీ ప్రియులను అలరిస్తున్నారు. మరోవైపు కొత్త చిత్రాలను అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా మరో కన్నడ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కన్నడ నటీనటులు గోపాలకృష్ణ దేశ్ పాండే, వినయ్, నిధి హెగ్డే, హరిణి శ్రీకాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన సినిమా శాకాహారి. సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హనుమాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాత బాలు చరణ్ తెలుగు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మర్డరీ మిస్టరీ నేపథ్యంలో రూపొందించిన ఈ మూవీకి కన్నడలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆద్యంతం ఊహించని ట్విస్టులు.. సస్పెన్స్ థ్రిల్లర్‏గా తెరకెక్కించిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ మూవీలో కన్నడ సీనియర్ నటుడు రంగాయన రఘు లీడ్ పాత్రలో నటించాడు. తెలుగులో మెయిన్ పాత్రకు సీనియర్ నటుడు గోపరాజు రమణతో డబ్బింగ్ చెప్పించారు. ఈ మర్డర్ మిస్టరీ మూవీ ఆహా ఓటీటీలో ఆగస్ట్ 24 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇందుకు సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ చేయగా.. సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు నిర్మాతలకు లాభాలను కూడా తెచ్చిపెట్టింది. గతంలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే కేవలం కన్నడలోనే ఈ చిత్రంలో అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు నేరుగా తెలుగులో రిలీజ్ చేయనున్నారు.

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రంలో ఊహించని ట్విస్టులతోపాటు విజువల్స్, బీజీఎమ్ సినిమాకు హైలెట్ అయ్యాయి. అలాగే ఈ సినిమాలో హింసాత్మక దృశ్యాలతోపాటు సర్ ప్రైజింగ్ సీన్స్ ఉన్నాయంటూ క్రిటిక్స్ చెప్పుకొచ్చారు. కన్నడలో పలు థియేటర్లలో ఏకంగా యాబై రోజులపాటు ఆడింది ఈ చిత్రం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.