కన్నడ సినీ పరిశ్రమలో మంచి విజయాన్ని అందుకున్న చిత్రాల్లో రూపాంతర ఒకటి. జూలైలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. స్టోరీ, స్క్రీన్ ప్లేతోపాటు డైరెక్టర్ టేకింగ్, యాక్టింగ్ అదిరిపోయాయంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కన్నడ అగ్ర దర్శకుడు రాజ్ బీ శెట్టి కీలకపాత్రలో నటించిన ఈ మూవీలో లేఖనాయుడు, అంజన్ భరద్వాజ్, సోమశేఖర్, భరత్ జీబీ ముఖ్య పాత్రలు పోషించారు. మొత్తం నాలుగు కథలతో ఈ అంథాలజీ డ్రామా థ్రిల్లర్ మూవీని డైరెక్టర్ మిథిలేష్ రూపాంతర తెరకెక్కించారు. ఈ సినిమాతోనే దర్శకుడిగా మిథిలేష్ కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టారు.
అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ సినిమా శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన నెలన్నర తర్వాత రూపాంతర చిత్రం ఓటీటీలో అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. సమకాలీన సమాజంలోని సమస్యలకు థ్రిల్లర్ అంశాలను జోడించి దర్శకుడు నాలుగు కథలను రూపాంతర మూవీలో చూడొచ్చు.
కథ విషయానికి వస్తే..
పల్లెటూరికి చెందిన వృద్ధులైన రైతు దంపతులు అనుకోకుండా సిటీకి వలస వస్తారు. ఉరుకుల పరుగుల ప్రపంచంలో వారు ఎదుర్కొన్న కష్టాలను ఫస్ట్ స్టోరీలో చూపించాడు డైరెక్టర్. బిచ్చగత్తె దగ్గర బాగా డబ్బు ఉండడం చూసి పోలీస్ ఆఫీసర్, కానిస్టేబుల్ ఆమెను అనుమానిస్తారు. కానీ ఆ తర్వాత ఆమె గురించి తెలుసుకున్న నిజాలను రెండో స్టోరీలో చూపించారు. ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారిన ఓ యువకుడు జీవితం ఏమయ్యింది.? దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది మూడో కథలో చూపించారు. అనుకోకుండా ఓ లోకల్ రౌడీతో ఐటీ ఉద్యోగి గొడవపడడం.. శత్రువులుగా ఉన్న వారిద్దరు మిత్రులుగా ఎలా మారారు అనేది నాలుగో కథ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.