Amigos Movie: ఓటీటీలోకి వచ్చేసిన కళ్యాణ్ రామ్ సినిమా.. ‘అమిగోస్’ ఎక్కడ చూడొచ్చంటే..

|

Apr 01, 2023 | 5:18 PM

డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ అమిగోస్.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. ఆ తర్వాత డల్ అయ్యింది. అనుకున్నంత స్థాయిలో ఈ చిత్రం మెప్పించలేకపోయింది.

Amigos Movie: ఓటీటీలోకి వచ్చేసిన కళ్యాణ్ రామ్ సినిమా.. అమిగోస్ ఎక్కడ చూడొచ్చంటే..
Amigos
Follow us on

నందమూరి టాలెంటెడ్ హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. చాలా కాలంగా హిట్టు కొట్టేందుకు ఎదురుచూస్తున్న ఈ హీరో.. గతేడాది బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక అదే జోష్‏లో ఈ ఏడాది అమిగోస్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ అమిగోస్.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. ఆ తర్వాత డల్ అయ్యింది. అనుకున్నంత స్థాయిలో ఈ చిత్రం మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తుంది.

ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యేందుకు కాస్త ఎక్కువ సమయమే తీసుకుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఓటీటీలో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన కన్నడ బ్యూటీ ఆశికా రంగనాథ్ నటించింది. ఈ మూవీతోనే ఆశికా తెలుగు తెరకు పరిచమయైంది.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతం అందించారు. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలకపాత్రలో పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డేవిల్ చిత్రంలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.