Hostel Days: ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్‌ తెలుగు వెబ్ సిరీస్.. హాస్టల్‌ డేస్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

|

Jul 09, 2023 | 5:14 PM

కొన్ని రోజలు క్రితం వరకు తెలుగు, ఇంగ్లిష్‌ భాషలకే పరిమితమైన వెబ్‌ సిరీస్‌లు ఇప్పుడు తెలుగులోనూ వస్తున్నాయి. పరంపర, న్యూసెన్స్‌, ఏటీఎమ్‌, సైతాన్‌ వంటి తెలుగు వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఓటీటీ ఆడియెన్స్‌కు తగ్గట్టుగానే హరీష్‌ శంకర్‌, మహి. వి. రాఘవ్‌ వంటి డైరెక్టర్లు కూడా వెబ్‌ సిరీస్‌ల బాట పడుతున్నారు .

Hostel Days: ఓటీటీలో మరో ఇంట్రెస్టింగ్‌ తెలుగు వెబ్ సిరీస్.. హాస్టల్‌ డేస్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Hostel Days Web Series
Follow us on

కొన్ని రోజలు క్రితం వరకు తెలుగు, ఇంగ్లిష్‌ భాషలకే పరిమితమైన వెబ్‌ సిరీస్‌లు ఇప్పుడు తెలుగులోనూ వస్తున్నాయి. పరంపర, న్యూసెన్స్‌, ఏటీఎమ్‌, సైతాన్‌ వంటి తెలుగు వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఓటీటీ ఆడియెన్స్‌కు తగ్గట్టుగానే హరీష్‌ శంకర్‌, మహి. వి. రాఘవ్‌ వంటి డైరెక్టర్లు కూడా వెబ్‌ సిరీస్‌ల బాట పడుతున్నారు .అలా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌ తెలుగులో రానుంది. ఇప్పటికే హిందీ, తమిళ్‌ భాషల్లో సూపర్‌ హిట్‌గా నిలిచిన హాస్టల్‌ డేస్‌ సిరీస్‌ తెలుగు వెర్షన్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో జులై 13 నుంచి అందుబాటులోకి రానుంది. తాజాగా హాస్టల్‌ డేస్‌ సిరీస్‌కు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ రిలీజైంది. ఇంజినీరింగ్‌ కాలేజీ హాస్టల్స్‌లో ఉండే ర్యాగింగ్, ఫ్రెండ్‌షిప్‌, లవ్‌, చదువులు.. ఇలా యూత్‌కు నచ్చే అన్ని అంశాలను ట్రైలర్‌లో చక్కగా చూపించారు. ఈ సిరీస్ లో దరహాస్ మాటూరు, అక్షయ్ లాగుసాని, మౌళి తనూజ్, అనన్య ఆకుల, ఐశ్వర్య, జైయేత్రి తదితరులు నటించారు.

హాస్టల్‌ డేస్‌ వెబ్‌ సిరీస్‌లో మొత్తం ఎపిసోడ్లు ఉండనున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ది వైరల్ ఫీవర్ (TVF) ఈ సిరీస్‌ను నిర్మించగా, ఆదిత్య మందాలు దర్శకత్వం వహించారు. కాగా హిందీ, తమిళ్‌లో ఈ వెబ్‌ సిరీస్‌కు సూపర్‌ హిట్‌ టాక్‌ వచ్చింది. మరి తెలుగులోనూ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి..