OTT Movie: భయపెట్టే సీన్లు.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు.. టాప్ ట్రెండింగ్‌లో 463 కోట్ల హారర్ థ్రిల్లర్

ప్రస్తుతం ఈ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ టాప్ ట్రెండింగ్ సినిమాల జాబితాలో టాప్ వన్ ప్లేసులో దూసుకుపోతోంది ఊహించని థ్రిల్లింగ్ ట్విస్టులు, భయపెట్టే సీన్స్, హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉండటంతో ఓటీటీ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు.

OTT Movie: భయపెట్టే సీన్లు.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు.. టాప్ ట్రెండింగ్‌లో 463 కోట్ల హారర్ థ్రిల్లర్
OTT Movie

Updated on: Jul 30, 2025 | 9:11 PM

గత వారం పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన మూవీస్, సిరీస్ లు వివిధ ఓటీల్లోకి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇందులో ఓ సినిమా మాత్రం ఓటీటీ ఆడియెన్స్ ను తెగ భయపెడుతోంది. ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సుమారు 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఓవరాల్ గా రూ. 463 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక సుమారు మూడు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రాగా ఇక్కడ కూడా సేమ్ రెస్పాన్స్ వస్తోంది. సర్వైవల్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ మూవీలో హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇందులోని ట్విస్టులకు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అందుకే ఇప్పుడీ సినిమా ఓటీటీలో టాప్ వన్ ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మ్యాక్స్ , ఏబ్, నినా, మెగన్, క్లోవర్ .. అనే ఐదుగురు స్నేహితులు లాంగ్ డ్రైవ్ కి బయల్దేరతారు. ఓ ఫారెస్టు ఏరియాలోకి ఎంటర్ అయ్యాక వారికి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. క్లోవర్ తన చెల్లెలు ‘మెల్’ కనిపించకుండా పోవడానికి ముందు వీడియో చేసిన ప్రదేశం లో అందరూ ఆగిపోతారు. ఈ అడవికి సమీపంలో ‘గ్లోర్ వ్యాలీ’ ఉందనీ, మెల్ అటుగా వెళ్లిన తరువాతనే కనిపించకుండా పోయిందని క్లోవర్ తెలుసుకుంటుంది. దీంతో ఫ్రెండ్స్ అందరూ ‘గ్లోవర్ వ్యాలీ’కి చేరుకుంటారు. ఆ ప్రదేశంలో ఒక పాత ఇల్లు ఉండటం చూసి, అందులోకి వెళతారు. అక్కడ కనిపించకుండా పోయినవారి ఫొటోలు ఒక నోటీస్ బోర్డులో ఉంటాయి. అందులో ‘మెల్’ ఫొటో కూడా ఉంటుంది.

ఆ పాడుబడిన ఇంట్లో పాత కాలంనాటి ఒక అవర్ గ్లాస్ (ఇసుక గడియారం) ఉంటుంది. అది సూచించే సమయాన్ని బట్టి ఆ ఇంట్లో పరిస్థితులు మరింత భయానకంగా మారిపోతాయి. తెల్లవారేలోగా అందరూ ఆ ఇంట్లో నుంచి బయటపడాలని వారు నిర్ణయించుకుంటారు. మరి ఆ ప్రయత్నంలో వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనుకున్నట్లే వారు ఆ వ్యాలీ నుంచి బయటపడ్డారా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు అన్ టిల్ డాన్. అంటే సాయంత్రం వరకు అని అర్థం వస్తుంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మూవీ టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది.ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, పోలిష్, స్పానిష్, తమిళ్, థాయి వంటి ప్రముఖ 7 భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి