AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆ నవ్వు చూస్తే చస్తారు.. ఓటీటీలోకి భయానక హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

హారర్ జోనర్‏లో వచ్చే సినిమాలు చూసేందుకు అడియన్స్ ఎంత ఆసక్తి చూపిస్తుంటారో తెలిసిందే. మిస్టరీస్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఇప్పుడు ఏ రేంజ్ క్రేజ్ , డిమాండ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. ఆద్యంతం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించే కంటెంట్ ఆధారంగా చేసుకుని వచ్చే చిత్రాలకు జనాల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది.

OTT Movie: ఆ నవ్వు చూస్తే చస్తారు.. ఓటీటీలోకి భయానక హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Smile
Rajitha Chanti
|

Updated on: Nov 21, 2024 | 6:46 AM

Share

ఇప్పుడు హారర్ చిత్రాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. భాషతో సంబంధమే లేకుండా వచ్చే మిస్టరీ థ్రిల్లర్స్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఒకే ఒక్క పాయింట్ ఆధారంగా చేసుకుని రూపొందించే చిత్రాలు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై దూసుకుపోతున్నాయి. తాజాగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చింది. యూనిక్ పాయింట్ తో రూపొందించిన ఆ సూపర్ హిట్ మూవీ ‘స్మైల్’. 2022లో వచ్చిన ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఐఎమ్‏డీబీలో ఈ చిత్రానికి 6.5 రేటింగ్ వచ్చింది. ఈ సినిమా విడుదలైన రెండేళ్లకు సీక్వెల్ రిలీజ్ చేశారు. అదే స్మైల్ 2. అక్టోబర్ 18 న థియేటర్లలో విడుదలై ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

సినిమా కాన్సెప్ట్ నవ్వు చూస్తే చనిపోవడం. అవును… నవ్వు చూస్తే చస్తారు అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఓ సైకలాజికల్ డాక్టర్ వద్దకు వచ్చిన పేషెంట్.. తనను చూస్తూ అందరూ నవ్వుతున్నారని.. తనను ఏదో వెంటాడుతుందని తను భయపడే విషయాలు చెప్పుకుంటుంది. డాక్టర్ తో మాట్లాడుతుండగానే ఆమెను ఓ విచిత్రమైన ఆకారం చంపుతుందని భయపడుతుంది. కాసేపటికే ఆమె చనిపోతుంది. చనిపోయిన తర్వాత మళ్లీ లేచి నిల్చుని డాక్టర్ వైపు నవ్వుతూ చూస్తుంది. ఆమె మరణం తర్వాత డాక్టర్ జీవితంలో ఎదురైన భయానక పరిస్థితులే స్మైల్. నవ్వును చూసిన వారంతా వరుసగా చనిపోవడమే ఈ చిత్రం. అసలు వాళ్లంతా ఎందుకు చనిపోతున్నారు.. ? అసలు ఆ డాక్టర్ ఎలా బయటపడ్డారు.. ? అనే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ చిత్రంలో హాలీవుడ్ హీరోయిన్ నవోమి స్కాట్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని భయం పుట్టించేలా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన స్మైల్ 2 సినిమాలో అమెరికాలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతుంది..

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us