Unstoppable with NBK S2: ప్రభాస్‏ను ఓ రేంజ్‏లో టీజ్ చేసిన గోపిచంద్, బాలయ్య.. కొత్త గ్లింప్స్ అదిరిపోయింది..

అందులో ప్రభాస్ ను ఓ రేంజ్ లో టీజ్ చేశారు గోపిచంద్. డార్లింగ్‏కు సంబంధించిన పర్సనల్ విషయాలను బయటపెట్టేందుకు గోపిచంద్ ప్రయత్నిస్తుండగా.. ఆపేందుకు ప్రభాస్ ట్రై చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

Unstoppable with NBK S2: ప్రభాస్‏ను ఓ రేంజ్‏లో టీజ్ చేసిన గోపిచంద్, బాలయ్య.. కొత్త గ్లింప్స్ అదిరిపోయింది..
Prabhas, Gopichand

Updated on: Dec 15, 2022 | 7:44 PM

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ వేదికపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. డార్లింగ్ ఎపిసోడ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక కేవలం ప్రభాస్ మాత్రమే కాకుండా.. తన స్నేహితుడు గోపీచంద్‏ కూడా వచ్చారు. తొలిసారి డిజిటల్ వేదికపై అది కూడా బాలయ్యతో కలిసి డార్లింగ్ కనిపించనున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన ప్రభాస్ గ్లింప్స్‏కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గోపిచంద్ గ్లింప్స్ ఆహా మేకర్స్ విడుదల చేశారు. అందులో ప్రభాస్ ను ఓ రేంజ్ లో టీజ్ చేశారు గోపిచంద్. డార్లింగ్‏కు సంబంధించిన పర్సనల్ విషయాలను బయటపెట్టేందుకు గోపిచంద్ ప్రయత్నిస్తుండగా.. ఆపేందుకు ప్రభాస్ ట్రై చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

తాజాగా విడుదలైన ప్రోమో .. ప్రభాస్ టాస్క్ ఆడుతుండగా.. వెనక నుంచి గోపిచంద్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బాలయ్యతో కలిసి గోపిచంద్ డార్లింగ్ ను ఓ ఆటాడుకున్నారు. అందులో డార్లింగ్ కు సంబంధించిన ఓ సీక్రెట్ రివీల్ చేసేందుకు గోపిచంద్ ట్రై చేయగా.. ఓరెయ్ అంటూ ఆపే ప్రయత్నం చేశారు ప్రభాస్. ఇక ఆ తర్వాత గోపిచంద్ మీదకు ఏదో విసరడానికి ప్రయత్నిస్తుండగా.. బాలయ్య గోపిచంద్ కు అడ్డుగా నిలబడ్డారు. చివరగా బాలయ్య అది ఒంగోలియన్స్ అంటూ చెప్పడం వినవచ్చు. ప్రస్తుతం ఈ కొత్త గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇక తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే.. ప్రభాస్, గోపిచంద్ మధ్య ఉన్న స్నేహబంధం ఎలాంటిదో అర్థమవుతుంది.

ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. డార్లింగ్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సలార్, ప్రాజెక్ట్ కె సినిమాల పై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.