వామ్మో.. ! ఈ సిరీస్ చూస్తే భయంతో వాంతులు చేసుకోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ వెబ్ సిరీస్

థిల్లర్ సినిమాలకు, హారర్ మూవీలకు ఓటీటీలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓటీటీల పుణ్యమా అని ప్రేక్షకులు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఓ వైపు కొత్త సినిమాలు థియేటర్స్ లో అదరగొడుతుంటే మరో వైపు ఓటీటీల్లో సినిమాలు మెప్పిస్తున్నాయి.

వామ్మో.. ! ఈ సిరీస్ చూస్తే భయంతో వాంతులు చేసుకోవాల్సిందే.. ఓటీటీని ఊపేస్తున్న హారర్ వెబ్ సిరీస్
Horror Movie

Updated on: Jul 11, 2025 | 10:25 AM

చాలా మంది సినీ లవర్స్ హారర్ సినిమాలు చూడటానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎంత భయంగా అనిపించినా కూడా కళ్లు మూసుకుంటూనే చూసేవారు చాలా మంది ఉంటారు. కానీ ఒంటరిగా చూడాలంటే మాత్రం భయమే. ఓటీటీల్లోనూ హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కేవలం తెలుగులో సినిమాలు మాత్రమే కాదు ఇతరభాషల హారర్ సినిమాలు చూడటానికి కూడా ప్రేక్షకులకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా తెరకెక్కి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతున్న ఈ వెబ్ సిరీస్ మాత్రం గుండెల్లో దడ పుట్టిస్తోంది. హారర్ మూవీ లవర్స్‏కు సైతం వణుకు పుట్టించే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ ఏంటో తెలుసా.. ?

ఇది కూడా చదవండి : అక్క స్టార్ హీరోయిన్.. చెల్లి మాత్రం సినిమాలకు దూరంగా ఇలా.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

అదే 1000 బేబీస్. మలయాళంలో నుంచి వచ్చిన ఈ న్యూ వెబ్ సిరీస్ హారర్ జానర్ కావడం విశేషం. ఇందులో సీనియర్ నటుడు రెహమాన్, నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించగా.. సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ గా దీనిని రూపొందించారు. మొదటి నుంచి ఫస్ట్ లుక్, ట్రైలర్, టీజర్ ఇలా అన్నింటిని క్యూరియాసిటిని కలిగిన ఈ వెబ్ సిరీస్.. గత ఏడాది అక్టోబర్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. విడుదలైన ఒక్కరోజులోనే ట్రెండింగా్ లో టాప్ కు వచ్చేసింది. మలయాళంలో రూపొందించిన ఈ 1000 బేబీస్ వెబ్ సిరీస్ ప్రస్తుతం ఏడు భాషలలో అందుబాటులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి : 1000కోట్ల హీరోయిన్.. ఆస్తి పాస్తులకు లెక్కే లేదు.. కానీ చిన్నకారులో తిరుగుతున్నముద్దుగుమ్మ

మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠి, బెంగాళీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సిరీస్ చూసేందుకు ఓటీటీ హారర్ మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సిరీస్ కు మంచి వ్యూస్ వస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి నజీమ్ కోయ దర్శకత్వం వహించగా.. సంజు శివమ్, జాయ్ మాథ్యూ, ఆదిల్ ఇబ్రహీం, ఆశ్విన్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. ఆగస్ట్ సినిమా బ్యానర్ పై షాది నదేషన్ ఆర్య ఈ సిరీస్ నిర్మించారు. సస్పెన్స్ ట్విస్టులు, భయపెట్టించే విజువల్స్ తో ఈ సిరీస్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ఈ సిరీస్ కు మొదటి నుంచి పాజిటివ్ రివ్యూస్ రావడంతో వ్యూస్ పెరుగుతున్నాయి. మరీ ఈ సిరీస్ మీరు చూడాలనుకుంటే హాట్ స్టార్‌లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి