
ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులు డబుల్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ఓటీటీలో మాత్రం అల్ రెడీ రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు.. డిఫరెంట్ జోనర్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రొమాంటిక్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్, హారర్ మూవీలకు మంచి డిమాండ్ ఉంది. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాదు.. ఇతర బాషల సినిమాలు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సినిమా ఓటీటీని ఊపేస్తోంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ థియేటర్స్ లో మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా.. కాగా ఓటీటీలో మాత్రం పదేళ్లుగా ట్రెండింగ్ లో ఉంది ఈ సినిమా..
ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ కూడా స్టార్స్.. ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. హీరోయిన్ కంటే హీరో 19ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? బాలీవుడ్ లో తెరకెక్కిన సినిమాలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించారు. అలాగే హీరోయిన్ గా సోనమ్ కపూర్ నటించింది. ఈ సినిమా పేరు ప్రేమ్ రతన్ ధన్ పాయో. ఈ సినిమా 2015లో విడుదలైంది.
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ డ్యూయల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలోని పాటలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. సూరజ్ బర్జాత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. దడపా 10ఏళ్లుగా ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టింది. రూ. 291.89 కోట్లు వసూల్ చేసింది. మొత్తంగా వరల్డ్ వైడ్ గా రూ. 388.48 కోట్లు వసూళ్ చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది ఈ సినిమా.. అలాగే యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది. ఈ సినిమాకు మొత్తం 13 అవార్డులను అందుకుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..