
కొన్ని సినిమాలు అడియన్స్ మనసులలో ఎప్పటికీ నిలిచిపోతాయి. దాదాపు 16 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీకి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం రూ.35 కోట్లతో నిర్మిస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకు అప్పట్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఏకంగా 18 అవార్డులు అందుకుంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు లవ్ ఆజ్ కల్. ఈ పేరు మీరు కూడా వినే ఉంటారు. హిందీలో వచ్చిన ఈ చిత్రానికి అన్ని భాషలలో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా నటించారు. తరాలు మారిన ప్రేమ మారదని చెప్పిన క్లాసిక్ హిట్ మూవీ ఇది. లవ్ ఆజ్ కల్ సినిమాలోని పాటలు సైతం సూపర్ హిట్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
ఈ సినిమాలో రెండు వేర్వేరు టైమ్ లైన్స్ లో నడిచే రెండు లవ్ స్టోరీలు ఉంటాయి. ఒకటి ఈ జనరేషన్ లవ్ స్టోరీ అయితే.. ఇంకోటి ఓల్డ్ స్కూల్ రెట్రో లవ్ స్టోరీ. యూత్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరు ప్రేమికులు ఎందుకు విడిపోయారు.. ? ఒకరికొకరు దూరమైన ఫీలింగ్ ను కనీసం తట్టుకోలేని ఇద్దరి మధ్య ఎందుకు దూరం వచ్చిందని.. చివరకు వారిద్దరి ప్రేమ గెలిచిందా.. ? నిజమైన ప్రేమకు దూరం, టైమ్ లాంటివి అడ్డంకులు కాదని తెలుసుకున్నారా అనేది సినిమా. రూ.35 కోట్లతో నిర్మించిన ఈ సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా రూ.117 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. 2009లో టాప్ హిందీ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
ఇందులో సైఫ్, దీపికాతోపాటు రిషి కపూర్, హర్లీన్ కౌర్ వంటి తారలు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ మ్యూజిక్ ప్రియులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. 16 ఏళ్లుగా ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉంటే..ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ లలో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..