Changure Bangaru Raja: ఓటీటీలోకి ‘ఛాంగురే బంగారు రాజా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ కానుందంటే..

క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమాలో కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ కార్తిక్ రత్నం హీరోగా నటించగా.. గోల్టీ నిస్సీ, సత్య, రవిబాబు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 15న విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా అంతగా విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 27 నుంచి ఓటీటీ మాధ్యామం ఈటీవీ విన్‏లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ చిత్రానికి సౌరబ్ సంగీతం అందించారు.

Changure Bangaru Raja: ఓటీటీలోకి 'ఛాంగురే బంగారు రాజా'.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ కానుందంటే..
Changure Bangaru Raja Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 20, 2023 | 7:49 AM

మాస్ మాహారాజా రవితేజ నిర్మించిన చిత్రం ఛాంగురే బంగారు రాజా. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. క్రైమ్ కామెడీ కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమాలో కేరాఫ్ కంచెరపాలెం ఫేమ్ కార్తిక్ రత్నం హీరోగా నటించగా.. గోల్టీ నిస్సీ, సత్య, రవిబాబు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సతీష్ వర్మ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 15న విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా అంతగా విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 27 నుంచి ఓటీటీ మాధ్యామం ఈటీవీ విన్‏లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ చిత్రానికి సౌరబ్ సంగీతం అందించారు.

ఈ సినిమాను ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై రవితేజ నిర్మించారు. ఇందులో కార్తీక్ రత్నం హీరోగా నటిస్తుండగా.. కుషిత కల్లపు కథానాయికగా నటించింది. ఇందులో సత్య అక్కల, రవిబాబు, ఎస్తేర్ నోరోన్హా, అజయ్ కీలకపాత్రలు పోషించారు. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతుంది.

ఇవి కూడా చదవండి

కథేంటంటే..

రంగురాళ్ల బ్యాక్ డ్రాప్ లో మర్డర్ మిస్టరీ కథాంశంతో రూపొందించారు. ఇందులో బంగార్రాజు అనే బైక్ మెకానిక్ పాత్రలో కార్తిక్ రత్నం నటించారు. నర్సీపట్నం దుగ్గాడ ప్రాంతంలో ఉండే బంగార్రాజుకు.. అదే గ్రామంలో ఉండే సోము నాయుడు (రాజ్ తిరందాసు) అనే వ్యక్తికి మధ్య చిన్న ఘర్షణ జరుగుతుంది. అయితే ఒకరోజు సోమునాయుడు అనుమానాస్పదంగా హత్యకి గురవుతాడు. దీంతో ఈ కేసులో బంగార్రాజు అరెస్ట్ అవుతాడు. మరీ ఈ కేసు నుంచి బంగార్రాజు బయటపడతాడా ?.. సత్య, రవిబాబు లకు మధ్య ఉన్న కనెక్షన్ ఏంటీ అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!