నందమూరి నటసింహం మొదటిసారి హోస్ట్‌గా వ్యవహరించిన షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ప్రసారమైన ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బాలయ్య యాంకర్‌గా ఫుల్ ఎనర్జీతో.. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేశారు. అతిథులను ప్రశ్నిస్తూ.. వారితో సున్నితంగా వ్యవహరిస్తూనే ఆడియన్స్ అడగాలనుకున్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నారు బాలయ్య. యాక్షన్ డ్రామా సినిమాలతో పవర్ ఫుల్‌గా కనిపించే తనలోని మరో కోణాన్ని అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు బాలయ్య. అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక మరోసారి ఓటీటీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 రాబోతుంది. ఇప్పటికే పోస్టర్స్ ద్వారా ఈ సీజన్ అప్డేట్స్ ఇచ్చిన నిర్వాహకులు… ఇప్పుడు ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు.
అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2ను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. మొదటి సీజన్‌కు సైతం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా.. ఇప్పుడు మరిన్ని హంగులతో.. సరికొత్తగా సీజన్ 2 తీసుకురాబోతున్నారు. జాంబీ రెడ్డి, కల్కి వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు సీజన్ 1 కంటే సీజన్ 2 మరింత గ్రాండ్ సక్సెస్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక మరోసారి బాలయ్యను ఎవరు ఊహించని విధంగా చూపించబోతున్నారు. సీజన్ 2 ట్రైలర్ ను అక్టోబర్ 4న విజయవాడలోని దాదాపు 20 వేల మంది అభిమానుల ముందు ఈ ట్రైలర్ ప్రదర్శించబోతున్నారు.
ఓ షో ట్రైలర్‌ను ఇలా అభిమానుల ముందు రిలీజ్ చేయడమనేది ఓటీటీ హిస్టరీలోని తొలిసారి. దీంతో ఈ ట్రైలర్ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ ప్రమోషన్లలో భాగంగా ప్రశాంత్ వర్మ, బాలయ్యలు ఉన్న లొకెషన్ పిక్స్ షేర్ చేస్తూ ట్రైలర్ డేట్ ప్రకటించింది ఆహా. “సీజన్ 1 ప్రోమో షూట్ తర్వాత బాలకృష్ణ గారితో మరోసారి తప్పకుండా పనిచేయాలని గట్టిగా అనుకున్నాను. అందుకే ఈసారి కూడా అవకాశం నాకే వచ్చింది. ఆహా టీం సీజన్ 2 కోసం స్టోరీ రాయాలి అనగానే నేను ఒప్పుకున్నాను. బాలయ్య గారితోటి పనిచేయమంటేనే ఒక అధ్భుతం. ఈ స్టోరీ అందరికీ నచ్చే విధంగా తీర్చిదిద్దుతాను. ఒక విధంగా ఇది నా ముద్దుబిడ్డ అని చెప్పొచ్చు. అక్టోబర్ 4న మీరు చూసే ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.
The blockbuster combination is set to repeat their magic with an amazing trailer!??? #UnstoppableWithNBK promo in 3 days!@PrasanthVarma @NandamuriBalakrishna pic.twitter.com/O18GrVMGYo
— ahavideoin (@ahavideoIN) October 1, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.