Bigg Boss 2 OTT: బిగ్ బాస్ ఓటీటీ 2 విన్నర్‌గా యూట్యూబర్.. ఎంత గెలుచుకున్నాడంటే..
ప్రముఖ ఓటీటీ యాప్ జియో సినిమాపై స్ట్రీమింగ్ అయిన బిగ్ బాస్ OTT సీజన్ 2 ఫైనల్ కు చేరుకుంది. ఆగస్ట్ 14 రాత్రి గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది. ఇక బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 విజేతను ప్రకటించారు. ఈసారి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 విజేతగా ఎల్విష్ యాదవ్‌ను విజేతగా ప్రకటించారు. ఆ తర్వాత అతనికి బిగ్ బాస్ ట్రోఫీని అందించడంతోపాటు రూ.25 లక్షలు కూడా అందించారు.

బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షోకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ భాషలలో విశేష ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటివరకు ఆరు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు హిందీలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 రన్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన ఈ షో దాదాపు 2 నెలల పాటు స్ట్రీమింగ్ అయింది. ప్రముఖ ఓటీటీ యాప్ జియో సినిమాపై స్ట్రీమింగ్ అయిన బిగ్ బాస్ OTT సీజన్ 2 ఫైనల్ కు చేరుకుంది. ఆగస్ట్ 14 రాత్రి గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది. ఇక బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 విజేతను ప్రకటించారు. ఈసారి బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 విజేతగా ఎల్విష్ యాదవ్‌ను విజేతగా ప్రకటించారు. ఆ తర్వాత అతనికి బిగ్ బాస్ ట్రోఫీని అందించడంతోపాటు రూ.25 లక్షలు కూడా అందించారు.
జూన్ 17 నుండి షో స్ట్రీమింగ్ ప్రారంభించినప్పుడు, ఆ సమయంలో మొత్తం 13 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ OTT ఇంట్లో చేరారు. అందులో పునీత్ సూపర్ స్టార్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంట్. కేవలం 24 గంటల్లోనే ఎలిమేట్ అయ్యాడు. అదే సమయంలో, ఒకరి తర్వాత ఒకరు మిగిలిన కంటెస్టెంట్లు కూడా ఎవిక్ట్‌లుగా మారారు.
బిగ్ బాస్ ఓటీటీ 2 విన్నర్ ఇన్ స్టా..
View this post on Instagram
బిగ్ బాస్ ఓటీటీ 2 విన్నర్ ఇన్ స్టా..
View this post on Instagram
చివరికి, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్, ఫుక్రా ఇన్సాన్ ఫేమ్ అభిషేక్ మల్హాన్, బీహార్‌కి చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మనీషా రాణి, బాబికా ధూర్వే, బాలీవుడ్ నటి పూజా భట్ ఫైనల్‌కి చేరుకున్నారు. ఇప్పుడు, మిగిలిన ఫైనలిస్టులలో ఎల్విష్ యాదవ్ ఈ సీజన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. సల్మాన్ ఖాన్ తన చేతులతో బిగ్ బాస్ OTT ట్రోఫీని అతనికి అందజేశారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



