AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanmukh Jaswanth: గోడకు కొట్టిన బంతిలా! ‘లీలా’తో కొత్త ప్రయాణం ప్రారంభించిన బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్

బ్రేకప్ లు.. వివాదాలు.. గొడవలు.. పోలీస్ కేసులు.. అరెస్టుల తర్వాత బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ మళ్లీ తన కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్ లతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ యూట్యూబ్ సంచలనం ఇప్పుడు ఏకంగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

Shanmukh Jaswanth: గోడకు కొట్టిన బంతిలా! 'లీలా'తో కొత్త ప్రయాణం ప్రారంభించిన బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్
Shanmukh Jaswanth
Basha Shek
|

Updated on: Jun 12, 2024 | 7:02 PM

Share

బ్రేకప్ లు.. వివాదాలు.. గొడవలు.. పోలీస్ కేసులు.. అరెస్టుల తర్వాత బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ మళ్లీ తన కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్ లతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ యూట్యూబ్ సంచలనం ఇప్పుడు ఏకంగా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ‘లీలా’ అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీతో మన ముందుకు వస్తున్నాడు. తాజాగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూజా కార్యకార్యక్రమాలు ఫిల్మ్ నగర్‌లో జరిగాయి. ఈ సందర్భంగా తన కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసిన షణ్ముఖ్.. ప్రముఖ దర్శకుడు వివేక్ ఆత్రేయ, నిర్మాత బెక్కం వేణు గోపాల్, ప్రవీణ్ కాండ్రేగుల, దర్శకుడు సుబ్బు తదితరలుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేశాడు. అయితే ఈ వెబ్ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం షణ్ముఖ్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. వరుస వివాదాలతో కెరీర్‌ను గందరగోళంలో పడేసుకున్న జస్వంత్ కు లీలా రూపంలో మంచి విజయం దక్కాంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

గంజాయి కేసులో ఇరుక్కుని..

యూట్యూబ‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ బిగ్‌బాస్‌ షోతో మరింత పాపుల‌ర్ అయ్యాడు. బిగ్‌బాస్ సీజ‌న్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ష‌ణ్ముఖ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. టైటిల్ విన్నర్ అవ్వాల్సిన షణ్ముఖ్ లేడీ కంటెస్టెంట్ సిరితో లిమిట్స్ దాటి ప్రవర్తించి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో కేవలం రన్నరప్ తోనే సరిపెట్టుకున్నాడు. దీనికి తోడు ప్రియురాలు దీప్తి సునయన కూడా షణ్ముఖ్ తీరు నచ్చకపోవడంతో బ్రేకప్ చెప్పేసింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో వివాదంలో చిక్కుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. గంజాయి కేసులో ష‌ణ్ముఖ్‌తో పాటు అత‌డి సోద‌రుడు సంప‌త్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో షణ్ముఖ్ కెరీర్ క్లోజ్ అయినట్టేనని చాలామంది అనుకున్నారు. అయితే గోడకు కొట్టిన బంతిలా మళ్లీ తిరిగొచ్చాడు. లీలా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.