Unstoppable: అన్‏స్టాపబుల్ 3 సీజన్ వచ్చేస్తోంది.. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే..

|

Oct 12, 2023 | 3:00 PM

మొదటి సీజన్ భారీ విజయాన్ని అందుకోగా.. ఆ తర్వాత వచ్చిన సెకండ్ సీజన్ సైతం అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సెకండ్ సీజన్‏లో అడియన్స్ ఊహించని అతిథులు అన్‏స్టాపబుల్ వేదికపై బాలయ్యతో కలిసి సందడి చేశారు. యంగ్ రెబాల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ ఏ రేంజ్‏లో సంచలనం సృష్టించాయో చెప్పక్కర్లేదు. పవన్ ఎపిసోడ్ తోనే రెండవ సీజన్ ముగిసింది. ఇక ఇప్పుడు అన్‏స్టాపబుల్ సీజన్ 3 కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అన్‏స్టాపబుల్ సీజన్ 3 వస్తుంది..

Unstoppable: అన్‏స్టాపబుల్ 3 సీజన్ వచ్చేస్తోంది.. ఫస్ట్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ ఇదే..
Bhagavanth Kesari Team
Follow us on

ఓటీటీ ప్రపంచంలోనే తొలిసారిగా సెన్సెషన్ క్రియేట్ చేసిన టాక్ షో ‘అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే’. తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ షోతో అటు నందమూరి బాలకృష్ణ కెరీర్‏కు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. అప్పటివరకు మాస్ యాక్షన్ హీరోగానే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన బాలయ్య.. ఈ షోతో యాంకరింగ్‏లోనూ తిరుగులేదని నిరూపించుకున్నారు. తన స్టైల్లో పంచులు, ప్రాసలతో ఆకట్టుకున్నారు. మొత్తానికి బాలయ్య హోస్టింగ్‎తో ఈ షో నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. మొదటి సీజన్ భారీ విజయాన్ని అందుకోగా.. ఆ తర్వాత వచ్చిన సెకండ్ సీజన్ సైతం అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సెకండ్ సీజన్‏లో అడియన్స్ ఊహించని అతిథులు అన్‏స్టాపబుల్ వేదికపై బాలయ్యతో కలిసి సందడి చేశారు. యంగ్ రెబాల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ ఏ రేంజ్‏లో సంచలనం సృష్టించాయో చెప్పక్కర్లేదు. పవన్ ఎపిసోడ్ తోనే రెండవ సీజన్ ముగిసింది. ఇక ఇప్పుడు అన్‏స్టాపబుల్ సీజన్ 3 కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అన్‏స్టాపబుల్ సీజన్ 3 వస్తుంది.. ఈసారి వచ్చే అతిథులు ఎవరా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఈ సమయంలోనే తాజాగా అన్‏స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్‏ను ప్రకటించింది ఆహా టీం. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ గెస్టులుగా భగవంత్ కేసరి టీమ్ రాబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈనెల 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా భగవంత్ కేసరి టీమ్ అన్‏స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ చేసినట్లుగా తెలుస్తోంది. కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ తోపాటు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్టులుగా వచ్చినట్లుగా తెలుస్తోంది. వీరికి సంబంధించిన ఫోటోలను ఆహా టీమ్ విడుదల చేసింది. ఈ ఎపిసోడ్ ఈనెల 17న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఇవి కూడా చదవండి

అయితే గత సీజన్స్ మాదిరిగా కాకుండా ఈ సీజన్ లో లిమిటెడ్ ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. మొదటి ఎపిసోడ్ మాత్రం భగవంత్ కేసరి టీమ్ తో ప్రారంభిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోన్న ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ఈనెల 17న స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఈసారి సైతం టాలీవుడ్ టాప్ హీరోస్ ఈ షోకు అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.