Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable With NBK: అన్‌స్టాపబుల్ న్యూ సీజన్ రెడీ.. తొలి ఎపిసోడ్‌లో సందడి చేయనున్న భగవంత్ కేసరి టీమ్..

ఈ సీజన్ అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. విలక్షణ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఈ సీజన్‌ను తనదైన శైలిలో హోస్ట్ చేయబోతున్నారు. ప్రపంచ టాక్ షోస్‌లో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఓ మైలు రాయిని క్రియేట్ చేసి గేమ్ చేంజర్‌గా మారింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి బిగ్గెస్ట్ స్టార్స్‌తో పాటు ప్రముఖ రాజకీయ నాయకులైన నారా చంద్రబాబు నాయుడు,

Unstoppable With NBK: అన్‌స్టాపబుల్ న్యూ సీజన్ రెడీ.. తొలి ఎపిసోడ్‌లో సందడి చేయనున్న భగవంత్ కేసరి టీమ్..
Unstoppable With Nbk
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 13, 2023 | 7:46 AM

ప్రేక్షకులను అబ్బుర పరచటానికి వన్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా సిద్ధమైంది. బ్లాక్ బస్టర్ అయిన తొలి రెండు సీజన్స్‌ని ఫాలో అవుతూ ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ లిమిటెడ్ ఎడిషన్‌ను ఆహా ప్రారంభించనుంది. ఈ సీజన్ అక్టోబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. విలక్షణ నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయ నాయకుడు నందమూరి బాలకృష్ణ ఈ సీజన్‌ను తనదైన శైలిలో హోస్ట్ చేయబోతున్నారు. ప్రపంచ టాక్ షోస్‌లో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే ఓ మైలు రాయిని క్రియేట్ చేసి గేమ్ చేంజర్‌గా మారింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి బిగ్గెస్ట్ స్టార్స్‌తో పాటు ప్రముఖ రాజకీయ నాయకులైన నారా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి సహా పలువురు గత సీజన్స్‌లో ముఖ్య అతిథులుగా హారజైన సంగతి తెలిసిందే. ఇంత మంది గొప్ప గొప్ప స్టార్స్, స్టార్ పొలిటీషియన్స్ వచ్చిన షోగా ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పుడు ప్రారంభం కానున్న సీజన్‌లో ‘భగవంత్ కేసరి’ టీమ్ ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమైంది.

తొలి ఎపిసోడ్‌లో ‘భగవంత్ కేసరి’ మూవీలో నటించిన ప్రధాన నటీనటులంతా పాల్గొనబోతున్నారు. డైరెక్టర్ అనీల్ రావిపూడి, నటి కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్ ఇందులో పార్టిసిపేట్ చేసి సినిమాలో యాక్ట్ చేయటంపై తమ అనుభవాలను తెలియజేయనున్నారు.

‘భగవంత్ కేసరి’ చిత్రంలో ఇప్పటి వరకు ఆడియెన్స్ చూడనటువంటి కొన్ని వీడియో స్నిప్పెట్స్‌తో పాటు ప్రేక్షకులను మెప్పించిన యాక్షన్ సన్నివేశాలు, సన్నివేశాల వెనుక కథనాలను ప్రత్యేకంగా చూపించనున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో దర్శకుడు అనీల్ రావిపూడి ప్రత్యేకంగా సినిమా మ్యూజిక్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ క్రియేషన్ వెనుకున్న క్రియేటివిటీ గురించి ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు.

తెలుగు సినిమా అభిమానులకు ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ ఓ ప్రత్యేకమైన టాక్ షోగా గుర్తుండిపోయింది. ఈ షో వెనుకున్న క్రియేటివ్ టీమ్ దీనికొక సరికొత్త యూనిక్‌నెస్‌ను తీసుకొచ్చారు. అందుకనే ఆడియెన్స్ హృదయాల్లో ఇది అన్‌స్టాపబుల్‌గా అలా నిలిచిపోయింది. అక్టోబర్ 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ షోను చూడటం అసలు మిస్ కాకండి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..